తెలంగాణ సీఎం కేసీఆర్ (Cm Kcr) కు, వైద్యారోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao)కు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA Jaggareddy) కృతజ్నతలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజీని కేటాయించి ఈరోజు ప్రారంభించనున్న నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA Jaggareddy) మీడియాతోమాట్లాడారు. తన పోరాటం ఫలించి సంగారెడ్డికి సీఎం కేసీఆర్ (Cm Kcr) మెడికల్ కాలేజీ మంజూరు చేశారని, ఈరోజు ప్రారంభానికి తనకు ఆహ్వానం అందిందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA Jaggareddy) తెలిపారు. గత ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీ హామీ ఇచ్చారు. అలాగే ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారని అన్నారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ (Cm Kcr) కు, మంత్రి హరీష్ రావు (Harish Rao)కు సంగారెడ్డి ప్రజల పక్షాన స్థానిక ఎమ్మెల్యేగా థ్యాంక్స్ చెబుతున్నాని జగ్గారెడ్డి (MLA Jaggareddy) పేర్కొన్నారు. ఈ మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లా ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే బాధ తప్పుతుందన్నారు. పేదలకు ఇక్కడి నుంచే వైద్యం లభిస్తుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA Jaggareddy) అన్నారు.
తెలంగాణ (Telangana) రాష్ట్ర చరిత్రలో ఈరోజు ప్రత్యేకంగా నిలవబోతుంది. ఏకంగా 8 జిల్లాల్లో 8 మెడికల్ కాలేజీల (Medical Colleges)ను ఒకే రోజు ఒకేసారి సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుండి ప్రారంభించనున్నారు. నేటి నుంచి ఆ మెడికల్ కాలేజీ (Medical Colleges)లో బోధనా తరగతులు ప్రారంభం కానున్నాయి. సంగారెడ్డి, మహబూబాబాద్, జగిత్యాల , కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, నాగర్ కర్నూల్, రామగుండంలో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు (Medical Colleges) ఏర్పాటు చేశారు. కాగా త్వరలోనే సిరిసిల్ల, ఖమ్మం , వికారాబాద్, కామారెడ్డి , కరీంనగర్ , జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, జనగాంలో కూడా మెడికల్ కాలేజీ (Medical Colleges)లు ఏర్పాటు కాబోతున్నాయి.
ఇవాళ కేసీఆర్ (Cm Kcr) ప్రారంభించబోయే మెడికల్ కాలేజీల (Medical Colleges)ను ఆయా జిల్లాల ఆసుపత్రులకు అనుసంధానం చేశారు. ఈ అకాడమిక్ ఇయర్ లో 1150 MBBS సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కాగా 2014లో తెలంగాణ ఏర్పాటు నాటికి రాష్ట్రంలో కేవలం 850 MBBS సీట్లు మాత్రమే ఉండేవి. కానీ 2022 నాటికీ కొత్త మెడికల్ కాలేజీ (Medical Colleges)ల ఏర్పాటుతో ఆ సంఖ్య 2091కి చేరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Harish Rao, Jaggareddy, Medical college, Sangareddy, Telangana