ys sharmila : "రాజన్న బిడ్డకు వెల్‌కమ్"... చెప్పిన ఎమ్మెల్యే.. ఆయన మా గుండెల్లో ఉంటారని కామెంట్..

ys sharmila : "రాజన్న బిడ్డకు వెల్‌కమ్"

ys sharmila : మునుగోడు నిరుద్యోగ దీక్ష చేస్తున్న వైఎస్ షర్మిలకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్దతు పలికారు. రాజన్న బిడ్డకు స్వాగతం అంటూ వెల్‌కమ్ చెప్పారు. ఆమెను చూస్తుంటే అచ్చు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూసినట్టే ఉందని వ్యాఖ్యానించారు.

  • Share this:
    ప్రతి మంగళవారం నిరుద్యోగ చేపట్టిన వైఎస్ షర్మిల నేడు మూడవ మంగళవారం నల్గోండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం పుల్లెల గ్రామంలో చేపట్టింది. అయితే ఆమె దీక్షకు స్థానిక ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గ్రాండ్ వెల్‌కం చెప్పాడు. ఢిల్లీ నుండి ఫోన్ చేసిన ఆమె దీక్షకు మద్దతు పలికాడు. స్వయంగా కలుద్దామని భావించినా..ఢిల్లీలో ఉండడం వల్ల రాలేకపోతున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆమె చేపట్టిన దీక్షకు తమ సంపూర్ణ మద్దతు ఉందంటూ చెప్పారు.

    మరోవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను బతికున్నంతవరకు గుండెల్లో ఉంటారని చెప్పారు. ఆయన తన నియోజకవర్గంలోని మునుగోడులో లక్ష ఎకరాలకు నీరందించే మునుగోడు ప్రాజెక్టు కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 750 కోట్ల రూపాయలు కేటాయించారని చాలామంది వ్యతిరేకించి తమ కుటుంబం ఈ ప్రాజెక్టును ఆయన చేత శంకుస్థాపన చేయిందని చెప్పారు. అయితే ఏడు సంవత్సరాల క్రితమే ఆ ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని, కాని ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే మిగిలిన పదిశాతం పనులను పూర్తి చేయడం లేదని అన్నారు. ఇది పూర్తయితే కొమటి రెడ్డి బ్రదర్స్‌తో పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పేరు వస్తుందనే దురుద్దేశ్యంతోనే ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం లేదని అన్నారు. దీంతో మునుగోడు ప్రాంతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అనేకమంది అభిమానులు ఉన్నారని అన్నారు.

    ఇక నియోజకవర్గంలో రైతు బంధును తమ నియోజకవర్గంలో కూడా అమలు చేయాలంటూ సుమారు పదివేల మందితో ధర్నా చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఈ విషయంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డితో కూడా సోమవారం వాగ్వావాదం జరిగినట్టు షర్మిలకు వివరించారు. ఆయన సభను అడ్డుకుని మైకు గుంజి వేశామని అన్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఖాలీ కొబ్బరి కాయలు కొట్టి ప్రజలను మోసం చేస్తారని అన్నారు.

    ఇక ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సైతం వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు చేస్తున్న సమయంలో స్వయంగా వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే..కాగా ఇద్దరు అన్నదమ్ములు వైఎస్ అనుచరులుగా ఆయన బతికి ఉన్నప్పుడు కొనసాగారు. కాగా ఇటివల కోమటిరెడ్డికి అధ్యక్షపదవి దక్కకపోవడంతో పార్టీ మారతారనే ప్రచారం కూడా కొనసాగింది.
    Published by:yveerash yveerash
    First published: