హోమ్ /వార్తలు /తెలంగాణ /

జీతాల్లో కోత... వీరికి మినహాయించండి... కాంగ్రెస్ ఎమ్మెల్యే సూచన

జీతాల్లో కోత... వీరికి మినహాయించండి... కాంగ్రెస్ ఎమ్మెల్యే సూచన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొన్ని వర్గాల ఉద్యోగులకు జీతాల కోత నుంచి మినహాయింపు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరారు.

కరోనా వైరస్ కారణంగా పది రోజుల నుంచి తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుండటంతో... ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఉద్యోగులకు వారి స్థాయిని బట్టి జీతాల్లో కోత విధించింది. ప్రస్తుత తరుణంలో ఇంతకుముందు మించి మార్గం లేదని రాష్ట్ర సర్కార్ అభిప్రాయపడింది. ఇదిలా తెలంగాణలో జీతాల కోతపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. జీతాల కోత నుంచి డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులను మినహాయించాలని ఆయన సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఏ రాష్ట్రంలో కోతలు విధించడం లేదని జీవన్ రెడ్డి తెలిపారు. అసలు జీతాల్లో కోతల అంశంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులతో ప్రభుత్వం చర్చించిందా ? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెన్షన్ డబ్బులతో బతికేవాళ్ళనూ ఇబ్బంది పెట్టడం సరికాదని సూచించారు. కోతల నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌ పునరాలోచించాలని జీవన్‌రెడ్డి సూచించారు.

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్థిక రంగం కుదేలవుతోందని సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత పెడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కోత విధింపులు మార్చి నుంచే ప్రారంభం అవుతాయని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం వేతనం ( గ్రాస్ సాలరీ)పై కోత విధించనున్నట్లు పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వేతనాల కోత అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో మొత్తం 4,49,516 మంది ఉద్యోగులున్నారు. ఇందులో ప్రభుత్వ, ఒప్పంద ఉద్యోగులు 4,30,674 మంది, 2.5 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు జీతభత్యాలు, పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.3,500 కోట్లు వెచ్చిస్తోంది. తాజా వేతన కోత వల్ల ప్రభుత్వానికి రూ.1,700 కోట్ల మేర ఆదా కానుంది.

- ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తారు.

- ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత.

- మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధిస్తారు.

- నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తారు.- అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత.

- నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో 10 శాతం కోత.

- అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మాదిరిగానే వేతనాల్లో కోత విధిస్తారు. కరోనా అత్యవసర సేవల్లో ఉన్న డాక్డర్లు, పోలీసులు, పారిశుద్ధ్య విభాగ ఉద్యోగుల జీతాల్లోనూ కోత విధించనున్నారు.

First published:

Tags: CM KCR, Jeevan reddy, Telangana

ఉత్తమ కథలు