Home /News /telangana /

నేడు షర్మిల.. రేపు జూనియర్ ఎన్టీఆర్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

నేడు షర్మిల.. రేపు జూనియర్ ఎన్టీఆర్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

షర్మిల, జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)

షర్మిల, జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: చంద్రబాబును తెలంగాణ నుంచి వెళ్లగొట్టేందుకు కుట్రలు చేసిన కేసీఆర్.. షర్మిల పార్టీ గురించి ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు.

    తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల బీజేపీ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వదిలిన బాణమే అని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బీజేపీ డైరెక్షన్ లోనే షర్మిల పార్టీ అని ఆరోపించారు. జగన్ ఇప్పటికే బీజేపీ తో కలసి పనిచేస్తున్నారన్న జగ్గారెడ్డి.. ఇక్కడ కేసీఆర్ కూడా బీజేపీ డైరెక్షన్‌లోనే నడుస్తున్నారని విమర్శించారు. వైసీపీ ,టిఆర్ఎస్ ,బీజేపీ మూడు కలసి కాంగ్రెస్ అధికారంలోకి రావొద్దనే కుట్ర పన్నుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే షర్మిల పార్టీ వెనుక బీజేపీ హస్తం ఉందని తనకు అనుమానం ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ ఉత్తర భారతదేశంలో ప్రభావం కోల్పోతోందని.. అందుకే దక్షిణ భారతదేశంపై ఫోకస్ చేశారని జగ్గారెడ్డి ఆరోపించారు.

    సెటిలర్స్‌ను షర్మిల వైపు తిప్పుకొనేందుకు ఆమెతో కొత్త పార్టీ పెట్టిస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. సెటిలర్స్ ఉన్న ప్రాంతంలో షర్మిల మీటింగ్‌లు పెడుతుందని చెప్పారు. రక్తం పంచుకున్న కూతురుతో వైఎస్ సీఎం కాలేదని.. రక్తం పంచుకొని కాంగ్రెస్ అభిమానులతో వైఎస్ సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో తమలాంటి చాలామంది వైఎస్ వారసులని అన్నారు. రెడ్డిలను కాంగ్రెస్‌ నుంచి విడదీయడానికే షర్మిలను రంగంలోకి బీజేపీ దించిందని ఆరోపించారు. ఇందిరా, రాజీవ్ గాంధీ పేరు లేకుండా వైఎస్ లేరని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నది తన చివరి కోరిక అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నోసార్లు అన్నారు.. ఆయన కూతురు షర్మిలకు ఆ బాధ్యత లేదా ? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ను ఎవరు దెబ్బతీయలేరని జగ్గారెడ్డి అన్నారు.

    Telangana mla jaggareddy, Jaggareddy News, Congress News, telangana congress, ap congress, తెలంగాణ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి న్యూస్, కాంగ్రెస్ న్యూస్, తెలంగాణ కాంగ్రెస్, ఏపీ కాంగ్రెస్
    జగ్గారెడ్డి (File- credit - twitter)


    ఇప్పుడు షర్మిల వచ్చిందని.. రేపు జూనియర్ ఎన్టీఆర్ లేదంటే ఎన్టీఆర్ కుటుంబం నుంచి మరో వ్యక్తి పార్టీ పెట్టొచ్చని అన్నారు. ఈ మాత్రం దానికి తెలంగాణ తెచ్చుకోవడం ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబును తెలంగాణ నుంచి వెళ్లగొట్టేందుకు కుట్రలు చేసిన కేసీఆర్.. షర్మిల పార్టీ గురించి ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. కేసీఆర్, జగన్, అసదుద్దీన్, షర్మిల అన్ని అమిత్ షా బాణాలే అని ఆరోపించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Jagga Reddy, Jr ntr, YS Sharmila

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు