తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ నెల 26 నుంచి పాదయాత్ర చేయాలని సిద్ధమవుతున్నారు. ఆ రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర ముగియనుండటంతో.. ఆ రోజు నుంచే రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాదయాత్ర చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది ఎన్నికల ఏడాది కావడంతో పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఆయన టీమ్ కూడా ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే కాంగ్రెస్‌లో ఇటీవల చోటు చేసుకున్న పలు పరిణామాలతో అసలు రేవంత్ రెడ్డి పాదయాత్రకు అనుమతి లభిస్తుందా ? లేదా ? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ సీనియర్లను పట్టించుకోవడం లేదంటూ అరోపణలు ఎదుర్కొన్న తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌ను (Manickam Tagore) కాంగ్రెస్ హైకమాండ్ పక్కనపెట్టింది. ఆయన స్థానంలో కొత్త ఇంఛార్జ్‌గా వచ్చిన మాణిక్ రావ్ థాక్రే.. ఇప్పటికే ఓసారి తెలంగాణకు వచ్చిన కాంగ్రెస్ (Congress) నేతలతో సమావేశమై వెళ్లారు. రేపు మరోసారి రాష్ట్రానికి రానున్నారు. మూడు రోజుల పాటు పార్టీ నేతలతో సమాలోచనలు జరపనున్నారు.
మాణిక్ రావ్ థాక్రే తెలంగాణ పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇస్తుందా ? లేదా ? అన్నది తేలిపోతుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని రేవంత్ రెడ్డి వర్గం ధీమాగా ఉండగా.. కొత్త ఇంఛార్జ్ రేవంత్ రెడ్డి దూకుడుగా బ్రేకులు వేస్తారని కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు భావిస్తున్నారు. దీంతో మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించబోతున్న తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.
Amit Shah: తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన..ఈ జిల్లాపై స్పెషల్ ఫోకస్
Khammam Politics: కేసీఆర్ సభకు దూరంగా పొంగులేటి వర్గం..పార్టీ వీడనున్నారా?
ఒకవేళ కాంగ్రెస్ నాయకత్వం రేవంత్ రెడ్డి పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోతే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? అనుమతి ఇస్తే కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏ విధమైన వైఖరితో ముందుకు సాగుతారన్న దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి వచ్చే వారం తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Revanth Reddy, Telangana