Home /News /telangana /

CONGRESS LEADERS WANT TO KEEP THEIR MOUTHS SHUT SAID TALASANI BN

అధికారంలో ఉన్నప్పుడు దోచుకుని.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలన్న తలసాని

Video : టీవీ ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులు : మంత్రి తలసాని

Video : టీవీ ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులు : మంత్రి తలసాని

70 సంవత్సరాల గోస నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతులకు విముక్తి లభించిందన్నారు. దిక్కుమాలిన పాలన, పనికిమాలిన ఆలోచనలతో ప్రజల తిరస్కరణకు గురైన మీకు తమ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు.

  అధికారంలో ఉన్నంతకాలం అభివృద్దిని పట్టించుకోకుండా రాష్ట్రాన్ని దోచుకున్న కాంగ్రెస్ నాయకులు నేడు బుద్ధి, జ్ఞానం లేకుండా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. గురువారం మాసాబ్ ట్యాంకులోని పశుసంవర్ధక శాఖ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతును రాజు చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, ఇందుకోసం ప్రభుత్వం రైతు బంధు, రైతు భీమా, 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతుబందు పథకాన్ని కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఎరువుల కోసం రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు చేసిన రైతులపై లాఠిచార్జి జరిపించిన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లేవని గుర్తుచేశారు.

  70 సంవత్సరాల గోస నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతులకు విముక్తి లభించిందన్నారు. దిక్కుమాలిన పాలన, పనికిమాలిన ఆలోచనలతో ప్రజల తిరస్కరణకు గురైన మీకు తమ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్దితో ఒకవైపు కరోనా నియంత్రణకు కృషి చేస్తూనే మరోవైపు అభివృద్ధిపై దృష్టి సారించిదని చెప్పారు. మీలాగా దోచుకొనే వ్యవస్థ మాది కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి దుయ్యబట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్వాన్స్‌ల పేరుతో సొంత అవసరాలకు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకు వాడుకున్న చరిత్ర మీదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల, సీతారామ ప్రాజెక్ట్ తదితర ప్రాజెక్ట్ ల నిర్మాణాన్ని చేపట్టిందని వివరించారు.

  కాళేశ్వరం ప్రాజెక్ట్ అతిపెద్ద లిఫ్ట్ గా గుర్తింపును పొందిందని అన్నారు. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్‌గా నిలిచిందని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నామని తెలిపారు. దేశీయ, విదేశీ కంపెనీలు తెలంగాణ వైపు చూస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ రూ.25 వేల లోపు ఉన్న రైతు రుణమాఫీని చెల్లించామని, ఇది తమ ప్రభుత్వ గొప్పతనమని పేర్కొన్నారు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలోని ప్రజలు ఇబ్బందులు పడకూడదని, ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించ వద్దని ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. వలస కూలీలకు ప్రభుత్వం బియ్యం, నగదు పంపిణీ చేసిందని, స్వచ్చంద సంస్థల సహకారంతో బోజన సౌకర్యం కల్పించినట్లు అయన చెప్పారు. రైతులు పండించిన పంటలను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, దేశంలో ఎక్కడైనా ఇది అమలు జరుగుతుందా? అని ఆయన ప్రశ్నించారు. ఇవేమి తెలియని కాంగ్రెస్, బీజేపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్ట్‌లు ఎందుకు కట్టలేదని, 24 గంటలు ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.

  కేంద్ర ప్రభుత్వ ప్రకటన, పొరుగు రాష్ట్రాలలో ఉన్న పరిస్థితుల కారణంగానే రాష్ట్రంలో మద్యం దుకాణాలను తెరవడం జరిగిందని, ఎక్కువగా మద్యం తాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆదాయం కంటే రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికే ముఖ్యమంత్రి మొదటి ప్రాధాన్యత ఇస్తారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కూడా స్పష్టం చేశారని మంత్రి చెప్పారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను రాష్ట్రంలో పర్యటించిన కేంద్రం బృందం అభినందించిందని తెలిపారు. కరప్షన్ వ్యవస్థలో మంత్రిగా పని చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కరప్షన్ అంటే తనకు తెలియదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఖతమైందని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి స్పష్తం చేశారు. అది ఆల్ పార్టీ కాదని అలీ బాబా టీం అని ప్రతిపక్షాలను ఉద్దేశించి విమర్శించారు.
  Published by:Narsimha Badhini
  First published:

  Tags: CM KCR, Talasani SaiKiran Yadav, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు