నాగబాబుపై కాంగ్రెస్ నేత వీహెచ్ ఆగ్రహం

నాగబాబు, వీహెచ్

చిరంజీవి, పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రులన్న ఆయన.. ఇలాంటి వ్యాఖ్యలతో నాగబాబు చెడ్డపేరు తెచ్చుకోవద్దు హితవు పలికారు.

 • Share this:
  గాడ్సేను పొడిగిన నాగబాబు తీరుపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. గాంధీని చంపిన హంతకుడిని ఎలా ప్రశంసిస్తారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో నాగబాబుపై కాంగ్రెస్ సీనియర్ వి. హనుమంతరావు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగబాబు వ్యాఖ్యలతో బాధపడ్డామని.. ఆయన మాటలు పిల్లలు వింటే గాంధీని మర్చిపోయేలా ఉన్నారని వీహెచ్ అన్నారు. గాడ్సే అసలు దేశభక్తుడు ఎలా అయ్యాడని నాగబాబుపై మండిపడ్డారు. చిరంజీవి గాంధీ గురించి గొప్ప సినిమా తీశారని.. తమ్ముడు పవన్ కల్యాణ్ కమ్యూనిస్టుల గురించి సినిమా తీశారని చెప్పారు. కానీ నాగబాబు గాడ్సే గొప్పోడని పొగడుతున్నాడని విమర్శించారు వీహెచ్. చిరంజీవి, పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రులన్న ఆయన.. ఇలాంటి వ్యాఖ్యలతో నాగబాబు చెడ్డపేరు తెచ్చుకోవద్దు హితవు పలికారు.

  కాగా, నాథురాం గాడ్సే జయంతి రోజు నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ''నాధురాం గాడ్సే నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది చర్చనీయాంశం. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్'అని ట్వీట్ చేశారు నాగబాబు.

  ఆ ట్వీట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నాగబాబు వివరణ ఇచ్చారు. 'నేను నాథూరామ్ గురించి చేసిన ట్వీట్ నాథూరాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు. ఆయన వెర్షన్ కూడా జనాలకు తెలియాలి అని మాత్రమే అన్నాను. నాకు మహాత్మ గాంధీ అంటే ఎంతో గౌరవం ఉంది. నిజం చెప్పాలంటే నన్ను విమర్శించే వాళ్ల కన్నా నాకు ఆయనంటే ఎనలేని గౌరవం అని చెప్పుకొచ్చారు నాగబాబు. మొత్తానికి నాగబాబు నాథూరామ్ గాడ్సేపై చేసిన ట్వీట్ ఆయనకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది.
  Published by:Shiva Kumar Addula
  First published: