• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • CONGRESS LEADER REVANTH REDDY SAYS YS SHARMILA EMOTION IN MEETING WITH STUDENT IS TOTALLY DRAMA AK

YS Sharmila: షర్మిలది అంతా డ్రామా.. ఇదిగో సాక్ష్యం.. బయటపెట్టిన రేవంత్ రెడ్డి

YS Sharmila: షర్మిలది అంతా డ్రామా.. ఇదిగో సాక్ష్యం.. బయటపెట్టిన రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి, షర్మిల (ఫైల్ ఫోటో)

YS Sharmila-Revanth Reddy: ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకోవడం కోసమే షర్మిల ఈ డ్రామా ఆడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

  • Share this:
    తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని అందుకోసం సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్న వైఎస్ షర్మిల తీరుపై కాంగ్రెస్ ముఖ్యనేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల షర్మిల విద్యార్థులతో జరిపిన సమావేశంలో జరిగిన సంఘటన అంతా ఓ డ్రామా అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. స్టేజ్ మీదకు వచ్చి భావోద్వేగంతో మాట్లాడిన విద్యార్థిని షర్మిల ఓదార్చడం.. అండగా ఉంటానని హామీ ఇవ్వడం అంతా ఓ నాటకమని అన్నారు. ఓ మీడియా ఛానల్‌ ఇంటర్వ్యూ సందర్భంగా రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించిన విషయాలు వెల్లడించారు. షర్మిలతో మాట్లాడిన యువకుడి పేరు సునంద్ జోసెఫ్ అని తెలిపిన రేవంత్ రెడ్డి.. అతడు విద్యార్థి కాదని.. నిరుద్యోగి కూడా కాదని అన్నారు. కల్వరి టెంపుల్‌లో ఆర్కెస్ట్రా వాయిద్యాన్ని వాయిస్తుంటాడని అన్నారు. అతడి తండ్రి వైఎస్ఆర్ కంటే ముందే చనిపోయాడని రేవంత్ రెడ్డి అన్నారు.

    ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకోవడం కోసమే షర్మిల ఈ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో పార్టీ పెట్టాలని భావిస్తున్న షర్మిల.. ముందుగా ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై చేపట్టబోయే అక్రమ ప్రాజెక్టులను వ్యతిరేకించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వాటిని బహిరంగంగా వ్యతిరేకించే ధైర్యం షర్మిలకు ఉందా ? అని ప్రశ్నించారు. గతంలో సమైక్యాంధ్రకు అనుకూలంగా మాట్లాడి పాదయాత్ర కూడా నిర్వహించిన షర్మిల.. అప్పుడు జరిగిన దానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పి తెలంగాణలో పార్టీ పెట్టాలని ఆయన సూచించారు. కేవలం సెంటిమెంట్ పండించి తెలంగాణలో రాజకీయాలు చేయాలని అనుకుంటే.. అది సాధ్యంకాదని రేవంత్ రెడ్డి అన్నారు.

    YS Sharmila versus Revanth Reddy, revanth reddy comments on sharmila, telangana news, వైఎస్ షర్మిల వర్సెస్ రేవంత్ రెడ్డి, తెలంగాణ న్యూస్
    షర్మిలతో సునంద్ జోసెఫ్


    రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎలా ఉన్నా.. తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే దిశగా షర్మిల వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన వైఎస్ఆర్ అభిమానులు, నేతలతో ఆత్మయ సమావేశం నిర్వహించిన షర్మిల.. వివిధ వర్గాలతోనూ భేటీ అవుతున్నారు. తాను స్థాపించబోయే పార్టీ ఎలా ఉండాలి ? ఎలాంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలి ? అనే దానిపై వారి నుంచే అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మే 14 లేదా జులై 8న షర్మిల తన కొత్త పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు