• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • CONGRESS LEADER RAHUL GANDHI OPINION ON TELANGANA TPCC POST HERE IS THE DETAILS AK

Telangana: తెలంగాణపై రాహుల్ గాంధీకి ఓ లెక్క ? ఆ నేతకు అనుకూలమా ?

Telangana: తెలంగాణపై రాహుల్ గాంధీకి ఓ లెక్క ? ఆ నేతకు అనుకూలమా ?

ప్రతీకాత్మక చిత్రం

Telangana: టీపీసీసీ కూర్పు విషయంలో సామాజిక న్యాయం పాటించాలని అలా అయితేనే తెలంగాణలో పార్టీ బలపడుతుందని మధుయాష్కి అభిప్రాయపడ్డారు.

  • Share this:
    తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ పార్టీని గట్టెక్కించేందుకు.. టీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నేతలకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నేతలంతా ఎవరికివారే అన్నట్టుగా వ్యవహరిస్తుండటం.. కొత్త టీపీసీసీ చీఫ్ ఎవరు అన్న దానిపై క్లారిటీ రాకపోవడంతో.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుపడటం లేదు. ఇక జాతీయస్థాయిలో కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణలోని పార్టీ పరిస్థితిపై ఏమైనా దృష్టి పెట్టిందా ? అన్నది కూడా ఇక్కడి శ్రేణులకు అర్థంకావడం లేదు. గతంలో అనేక విషయాల్లో నాన్చివేత ధోరణిని అవలంభించిన విధంగానే.. కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపిక విషయంలోనూ కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరించడం తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు మింగుడుపడటం లేదు. అయితే తెలంగాణ కాంగ్రెస్ విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఓ స్పష్టమైన అవగాహన ఉన్నట్టు తెలుస్తోంది.

    తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ మధుయాష్కి శుక్రవారం రాహుల్‌ను కలిశారు. ఆ సమయంలో తెలంగాణలో పార్టీ పరిస్థితిపై రాహుల్ తనదైన శైలిలో స్పందించారని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. తెలంగాణలో కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పూర్తి స్థాయిలో పనిచేయడంలేదన్న అభిప్రాయాన్ని రాహల్ వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ భవిష్యత్తునే పణంగా పెట్టేలా పనితీరు ఉండొద్దని రాహుల్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో మాధుయాష్కి టీపీసీసీ చీఫ్ ప్రస్తావన తెచ్చినప్పుడు రాహుల్ గతంలోకంటే భిన్నంగా స్పందించినట్లు సమాచారం.

    టీపీసీసీ కూర్పు విషయంలో సామాజిక న్యాయం పాటించాలని అలా అయితేనే తెలంగాణలో పార్టీ బలపడుతుందని మధుయాష్కి అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంలో తనకు ఒక ప్రణాళిక ఉందని రాహుల్ చెప్పినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి.. టీపీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో ఆయన ఓ క్లారిటీతోనే ఉన్నారని అనిపిస్తోంది. అయితే ఈ పదవి విషయంలో ఆయన మనసులో ఎవరు ఉన్నారనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి టీపీసీసీ చీఫ్ విషయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బట్టి.. రానున్న కాలంలో తెలంగాణలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఆ పార్టీ ముఖ్యనేతకు పూర్తి స్పష్టత ఉన్నట్టు తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: