కేసీఆర్‌తో జగన్ చీకటి ఒప్పందాలు.. నాగం కీలక వ్యాఖ్యలు

కేసీఆర్, జగన్‌లు సమావేశం అయ్యాక కూడా జగన్ సంగమేశ్వర్ ప్రాజెక్టుకు జీఓ ఇచ్చారని, ఏపీ 170 టీఎంసీల నీరు దోచుకుందని ఆరోపించారు. నెల్లూరులో రెండు పంటలు పండించుకున్నారని, మూడో పంటకు సిద్ధం అవుతున్నారని తెలిపారు.

news18-telugu
Updated: June 15, 2020, 4:03 PM IST
కేసీఆర్‌తో జగన్ చీకటి ఒప్పందాలు.. నాగం కీలక వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్
  • Share this:
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు అన్యాయమే జరుగుతోందని కాంగ్రెస్ నేత, కృష్ణ నది జలాల పరిరక్షణ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణ భారీగా నష్టం జరుగుతుందన్నారు. సోమవారం ఆయన మల్లు రవి, చల్లా నర్సింహారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు కమిటీ పేరును కృష్ణ నది జలాల పరిరక్షణ కాంగ్రెస్ కమిటీగా పేరు మార్పుచేస్తున్నట్టు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌కు నది జలాలపై ఏ మాత్రం అవగాహన లేదని, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. కేసీఆర్, జగన్‌లు సమావేశం అయ్యాక కూడా జగన్ సంగమేశ్వర్ ప్రాజెక్టుకు జీఓ ఇచ్చారని, ఏపీ 170 టీఎంసీల నీరు దోచుకుందని ఆరోపించారు. నెల్లూరులో రెండు పంటలు పండించుకున్నారని, మూడో పంటకు సిద్ధం అవుతున్నారని తెలిపారు.

కృష్ణా నుంచి పెన్నా బేసిన్‌కు నీటిని తరలిస్తున్నారని, మనకు 69 శాతం కృష్ణాలో హక్కు ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. 12 వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ తెచ్చుకుంటే.. కేసీఆర్ జగన్‌తో చీకటి ఒప్పందాలు చేసుకొని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. జలయజ్ఞంలో చేపటైన ప్రాజెక్టులు, డిస్టిబ్యూటరీ కెనాల్స్ ఎందుకు చేపట్టట్లేదని, కృష్ణాలో నికర జలాలు కూడా తెలంగాణ వాడుకోలేదని స్పష్టం చేశారు. కృష్ణా నది కమిటీ అన్ని గ్రామాలు తిరుగుతుందని, కేసీఆర్ లోపాయకారి ఒప్పందాలను బయటపెట్టి, రైతుల పక్షాన పోరాడుతామని ప్రకటించారు.
First published: June 15, 2020, 4:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading