Home /News /telangana /

CONGRESS LEADER KOMATIREDDY VENKATREDDY COMMENTS ON HIS PARTY SWITCHING SLAMS REVANTH REDDY SK

Komatireddy Venkatareddy: పార్టీ మార్పుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు.. బరాబర్ చెప్పి పోతా..

కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy VenkatReddy: అమిత్ షాతో భేటీ వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కేవలం ప్రజల సమస్యలపైనే చర్చించామని అన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatareddy) ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah)తో భేటీ అయ్యారు. వీరిద్దరి సమావేశం ఇప్పుడు తెలంగాణ (Telangana)లో హాట్ టాపిక్‌గా మారింది. తమ్ముడి బాటలోనే ఆయన కూడా బీజేపీలో చేరతారన్న ప్రచారం వేళ.. వెంకటరెడ్డి అమిత్ షాతో భేటీ కావడం సంచలనంగా మారింది. ఐతే అమిత్ షాతో భేటీ వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కేవలం ప్రజల సమస్యలపైనే చర్చించామని అన్నారు. వరదల వల్ల తెలంగాణ ఎంతో నష్టపోయిందని.. రాష్ట్రంలో ఏరియల్ సర్వే చేయాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

    Komatireddy Venkatreddy: కాంగ్రెస్​లో చేరిన చెరుకు సుధాకర్​.. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సంచలన నిర్ణయం.. 

    '' తెలంగాణలో వరద కష్టాలపై అమిత్ షాతో మాట్లాడాను. వర్షాలు, వరదల వల్ల రూ.1400 కోట్ల నష్టం వాటిల్లింది. తెలంగాణలో ఏరియల్ సర్వే చేయాలని కోరాను. ఈ మీటింగ్‌కి వెళ్లకపోతే రాష్ట్రానికి నష్టం జరిగేది. కేంద్రం నుంచి చాలా నిధులను తీసుకొచ్చాను. నేను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు. పార్టీ మారేది ఉంటే.. బరాబర్ చెప్పి పోతా.'' అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

    అటు పార్టీలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యవహారంపై మరోసారి విమర్శలు గుప్పించారు వెంకటరెడ్డి. ఆయన తీరు వల్లే ఎంతో మంది నేతు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పుడున్నంత యాక్టివ్‌గా హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో  ఎందుకు లేడని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి ఇంకా స్పీకర్‌కే రాజీనామా ఇవ్వలేదు.. అప్పుడే ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారని విమర్శించారు. నేను ఇక్కడుంటే అక్కడ రేవంత్ రెడ్డి మీటింగ్ ఎలా పెడతాడు? నా లోక్‌సభ పరిధిలో నాకు తెలియకుండా సమావేశం పెట్టడం సమంజసమేనా? అని ప్రశ్నించారు వెంకటరెడ్డి. నా ఓటమి కోసం పనిచేసిన చెరుకు సుధాకర్‌ని పార్టీలో ఎలా చేర్చుకుంటారని విరుచుకుపడ్డారు. పాత కాంగ్రెస్ నేతలనంతా రేవంత్ రెడ్డి వెళ్లగొడుతున్నారని.. దాసోజు శ్రావణ్ లాంటి మేధావులను కూడా పార్టీ నుంచి పంపిస్తున్నారని మండిపడ్డారు వెంకటరెడ్డి.



    అంతకుముందు వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా అమిత్ షాతో సమావేశమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. బీజేపీలో ఎప్పుడు, ఎక్కడ చేరాలనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో పార్టీ అగ్రనేతల సమక్షంలో బీజేపీలో చేరాలని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. అలా కుదరని పక్షంలో మునుగోడు నియోజకవర్గంలోనే కాషాయ కండువా కప్పుకోవాలని చూస్తున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టం వచ్చే అవకాశముంది. ఇక తన సోదరుడు బీజేపీలో చేరే అంశం గురించి ప్రశ్నించిన్నప్పుడు.. తనకేమీ తెలియనదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. వీరిద్దరు కేంద్ర అమిత్ షాతో ఒకరి తర్వాత మరొకొరు.. విడివిడిగా.. భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Komatiredd, Komatireddy rajagopal reddy, Telangana, Telangana Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు