కేసీఆర్ (KCR) నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతూ తెలంగాణను నవ్వులపాలు చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Congress leader Bhatti Vikramarka) విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సర్కార్ విఫలమైందన్నారు. ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మునుగోడులో నిర్వహించారు. ఈ సమావేశంలలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. మునుగోడు (Munu Godu by-election) ప్రజల తీర్పుపై తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ మునుగోడుదని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి చరిత్ర ఈ ప్రాంత ప్రజలు టీఆర్ఎస్, బీజేపీకి లొంగిపోరని ఆయన చెప్పారు. పాల్వాయి స్రవంతిని ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్ కు మునుగోడు బలమైన డివిజన్ గా ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలనను ప్రజలు వద్దంటున్నారన్నారు.
పార్టీల నేతలందరూ మునుగోడు వైపే..
మునుగోడు (Munugodu). గత కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న నియోజకవర్గం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఇది కేవలం ఉప ఎన్నిక (Munugodu By Elections) మాత్రమే కాదు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పునకు రెఫరెండంగా రాజకీయ వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి. గత నెలలో జరిగిన సీఎం కేసీఆర్ మీటింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన, రేవంత్ రెడ్డి ప్రచారం.. జేపీ నడ్డా బహిరంగ సభ, సెప్టెంబర్ 17న మునుగోడుపై అమిత్ షా దిశా నిర్ధేశం ఇలా ప్రధాన పార్టీల నేతలందరూ మునుగోడు వైపే చూస్తున్నారు. ఇప్పటికే వలసలతో అక్కడ రాజకీయ వేడి రాజుకుంది. మునుగోడు నియోజకవర్గంలో గెలిచేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు ఉపఎన్నిక గెలుపు కంటే అభ్యర్ధి ఎంపికే అధిష్టానానికి శిరోభారంగా మారింది. నియోజకవర్గ పరిధిలో సోషల్ మీడియా సర్వేతో పాటు సీనియర్లు సైతం మాజీ మంత్రి పాల్వాయి స్రవంతి పేరు ప్రతిపాధిస్తే ...టీపీసీసీ చీఫ్ రేవంత్,ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ మాత్రం చల్లమల్ల కృష్ణారెడ్డికి మొగ్గు చూపారు. అయితే వీరిద్దరిలో ఎవర్ని మునుగోడు బైపోల్ బరిలోకి దింపితే బాగుంటుందనే అంశంపై కేసీ వేణుగోపాల్‌తో జరిగిన పార్టీ రాష్ట్ర ముఖ్యనేతల సమావేశంలో మెజార్టీ సభ్యులు మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె స్రవంతి పేరును ప్రతిపాధించడంతో లైన్ క్లియరైంది.
అయితే మునుగోడులో కాంగ్రెస్ బలంగానే ఉంటుంది. మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా సీపీఐ (CPI) అభ్యర్ధులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ (TRS) కు మద్దతివ్వాలని సీపీఐ నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు చొప్పు న ఇంచార్జులను నియమించింది. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.