Home /News /telangana /

CONGRES LEADER SHABBIER ALI ANGRY ON CM KCR FOR TAKING IMMEDIATE DECISION ON LOCKDOWN AK

తెలంగాణలో లాక్‌డౌన్ ప్రకటన.. ముందుచూపు లేదా ? మండిపడ్డ కాంగ్రెస్

షబ్బీర్ అలీ (ఫైల్ ఫోటో)

షబ్బీర్ అలీ (ఫైల్ ఫోటో)

లాక్‌డౌన్‌ కాలంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలతోపాటు మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్రంలోని టీఆర్ఎస్‌ సర్కార్‌ ఆర్థిక సహాయం అందించాలని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు.

    కోవిడ్‌ –19 కట్టడి పేరిట తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గంటల వ్యవధిలో లాక్‌డౌన్‌ ప్రకటించడంపై కాంగ్రెస్‌ పార్టీ విస్మయాన్ని వ్యక్తం చేసింది. ఒక్కసారిగా రాష్ట్రమంతా లాక్‌డౌన్‌ ప్రకటన చేసి ప్రజల్ని గందరగోళానికి గురిచేశారని మాజీ మంత్రి, శాసనమండలిలో కాంగ్రెస్‌ పక్ష మాజీ నేత మహమద్‌ అలీ షబ్బీర్‌ మండిపడ్డారు. తెలంగాణలో కరోనా వైరస్‌ కట్టడికి తగిన చర్యలు తీసుకోలేకపోయిన ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిందని... మొదటి నుండి కఠినమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచనలు చేస్తున్నా అందుకు ఏమాత్రం లేని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఇప్పుడు ఒక్కసారిగా లాక్‌డౌన్‌ ప్రకటన చేసి జనాన్ని అయోమయంలోకి నెట్టిందని ఆరోపించారు. గంటల వ్యవధి మాత్రమే ఉన్నప్పుడు నిత్యావసర వస్తువుల కోసం జనం ఎక్కడి వెళ్లాలని... ఒక్కసారిగా జనం వీధుల్లోకి వస్తే కరోనా వ్యాప్తి అవుతుందని ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు.

    ప్రజలను అంధకారంలో ఉంచడం సీఎం కేసీఆర్‌ అలవాటుగా మారిందని షబ్బీర్‌ అలీ విమర్శించారు. కరోనా మొట్టమొదటి కేసు వెలుగులోకి వచ్చినప్పుడు కేసీఆర్‌ చాలా తేలిగ్గా తీసుకుని పారాసుటమాల్‌ టాబ్లెట్‌తో నయం చేయవచ్చని కూడా చెప్పారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆ ప్రకటనలను మార్చడం కానీ, ప్రజలకు వాస్తవికత ఏమిటో చెప్పడం గానీ కేసీఆర్‌ ఎప్పుడూ ప్రయత్నం చేయలేదని తప్పుపట్టారు. పర్యవసానంగా, కేసీఆర్‌ చెప్పిన అబద్ధాలు, తప్పుడు నిర్ణయాల వల్ల కోట్ల మంది ప్రజలు బాధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    లాక్‌డౌన్‌ కాలంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలతోపాటు మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్రంలోని టీఆర్ఎస్‌ సర్కార్‌ ఆర్థిక సహాయం అందించాలని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. ప్రస్తుత ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత కరోనా వైద్య చికిత్సలను రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని షబ్బీర్‌ అలీ కోరారు. కరోనా వైరస్‌ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Lockdown, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు