ఆర్టీసీలో లేఖల కలకలం... కార్మికులకు కొత్త టెన్షన్

షరతులతో కూడిన లేఖలపై ఆర్టీసీ యాజమాన్యం సంతకాలు చేయించుకుంటోందనే ప్రచారం కార్మికులను ఆందోళనకు గురి చేస్తోంది.

news18-telugu
Updated: December 5, 2019, 12:47 PM IST
ఆర్టీసీలో లేఖల కలకలం... కార్మికులకు కొత్త టెన్షన్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆర్టీసీ సమ్మె ముగిసి కొద్ది రోజుల క్రితమే విధుల్లోకి చేరిక కార్మికులకు కొత్త టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తోంది. షరతులతో కూడిన లేఖలపై ఆర్టీసీ యాజమాన్యం సంతకాలు చేయించుకుంటోందనే ప్రచారం కార్మికులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆర్టీసీలో రెండేళ్ల పాటు కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించకూడదనే భావనలో ప్రభుత్వం... తమకు కార్మిక సంఘాలు అవసరం లేదని పేర్కొన్న లేఖలపై కార్మికులతో సంతకాలు చేయించుకునేందుకు సిద్ధమైందనే వార్తలు జోరందుకున్నాయి. ఇందుకు సంబంధించిన కొన్ని లేఖలు కార్మికులను టెన్షన్ పెడుతున్నాయి. కొన్ని డిపోలకు సంబంధించిన యాజమాన్యలు ఇలాంటి షరతులతో కూడిన లేఖలపై సంతకాలు చేయాలని కార్మికులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే చాలామంది కార్మికులు ఈ లేఖలపై సంతకం చేయడానికి సుముఖంగా లేరనే తెలుస్తోంది. అయితే దీనిపై ఆర్టీసీ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.


First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>