• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • CONCENTRATORS RECEIVED FROM GREEN CO BY MINISTER KTR AT SHAMSHABAD AIRPORT VRY HYD

Telangana :ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందించిన గ్రీన్‌ కో... రిసీవ్ చేసుకున్న మంత్రి కేటిఆర్

Telangana :ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందించిన గ్రీన్‌ కో... రిసీవ్ చేసుకున్న మంత్రి కేటిఆర్

ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందించిన గ్రీన్‌ కో... రిసీవ్ చేసుకున్న మంత్రి కేటిఆర్

Telangana : దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు రాష్ట్రాలకు కాన్సెంట్రేటర్లలను అందిస్తున్న గ్రీన్‌కో సంస్థ ముందుగా తెలంగాణకు వాటిని అందించింది. శంషాబాద్ విమానాశ్రయంలో వాటిని మంత్రి కేటిఆర్ రిసివ్ చేసుకున్నారు.

  • Share this:
తెలంగాణ రాష్ట్రం కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో పాలుపంచుకునేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్ కో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసింది.  ఈ మేరకు చైనా నుంచి ప్రత్యేకంగా వచ్చిన విమానంలోని ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లలను మంత్రి కేటిఆర్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు అందించారు.

ఈ సందర్భంగా గ్రీన్ కో సంస్థ యాజమాన్యానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.  తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి సాధ్యమైన అన్ని చర్యలను తీసుకుంటుందని, గ్రీన్ కో సంస్థ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా నిలిచేందుకు ముందుకు వచ్చి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించడం పట్ల మంత్రి కేటీఆర్ ఆ సంస్థ చైర్మన్ గోపికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం కరోనా కట్టడికి ఎలాంటి నిధుల కొరత లేదని, కాని సమయానికి ఆక్సిజన్ అందించడమే సవాలుగా మారిందని అన్నారు.ఇలాంటీ సమయంలో అత్యవసరమైన ఆక్సిజన్ అందించే కాన్సెంట్రేటర్ల లను చైనా నుంచి ప్రత్యేకంగా తెప్పించి ఇవ్వడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.ఇవి రెండువందల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి సమానమని చెప్పారు.

మరోవైపు చైనా నుంచి తెలంగాణకి తీసుకువచ్చేందుకు ఇండిగో సంస్థ సైతం తన ప్యాసింజర్ ఫ్లైట్ ని ఉపయోగించి  తీసుకువచ్చిన ఇండిగో యాజమాన్యానికి ధన్యవాదాలు  కేటీఆర్ కృతజ్జతలు తెలిపారు. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్న నాలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నందున... ఆ మేరకు అవసరమైన మందులు, ఆక్సిజన్ సరఫరా పెంచాలని  తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరమని ఇందుకు అనుకూలంగా స్పందించిన కార్పోరేట్ సంస్థలను ఆయన అభినందించారు.

ప్రస్తుత సంక్షోభ సమయంలో రాజకీయాలకతీతంగా అందర్నీ కలుపుకొని ముందుకు పోతున్నామని మంత్రి కేటిఆర్ తెలిపారు. ఆక్సిజన్ మరియు మందుల సరఫరా విషయంలో తెలంగాణ రాష్ట్రం మిగిలిన రాష్ట్రాల కన్నా మెరుగైన పరిస్థితిలో ఉందని గుర్తు చేశారు..ఇతర రాష్ట్రాల్లో మాదిరి ఆక్సిజన్ అందక జరిగిన దురదృష్టకర సంఘటనలు తెలంగాణలో నమోదు కాకుండా ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
Published by:yveerash yveerash
First published: