HOME »NEWS »TELANGANA »complete palamuru rangareddy project within 6 months cm kcr ordered officials in review ak

Telangana: ఆ రెండు ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. అధికారులకు డెడ్‌లైన్

Telangana: ఆ రెండు ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. అధికారులకు డెడ్‌లైన్
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Palamuru Rangareddy Dindi: పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులకు వెంట వెంటనే బిల్లులు చెల్లించడానికి తక్షణం రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

  • Share this:
    వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి వందశాతం పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఫ్లోరైడ్, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించే డిండి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి, ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని అన్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధుల వరద ఆగవద్దని, ఈ ఏడాది బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తామని సిఎం స్పష్టం చేశారు. అత్యవసరమైన, తక్కువ వ్యయంతో కూడిన పనుల కోసం హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరం లేకుండా, వివిధ స్థాయిల అధికారులే మంజూరు చేసి, పనులు నిర్వహించే అధికారం ఇచ్చే చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.

    పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై సమీక్షలో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్, పంపుహౌజ్, నార్లాపూర్ – ఏదుల కాలువ, ఏదుల పంపుహౌజ్, ఏదుల-వట్టెం కాలువ, వట్టెం రిజర్వాయర్, వట్టెం-కర్వెన కాలువ, కర్వెన రిజర్వాయర్, కర్వెన-ఉద్దండాపూర్ కాలువ, టన్నెల్ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే మొత్తం మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని కేసీఆర్ అన్నారు. -పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులకు వెంట వెంటనే బిల్లులు చెల్లించడానికి తక్షణం రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.



    ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణను పూర్తి చేయడానికి తక్షణం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను సిఎం కోరారు. చట్ట ప్రకారం ఇవ్వల్సిన పరిహారం రైతులకు అందించి, వెంటనే భూ సేకరణను పూర్తి చేసి, భూమిని నీటి పారుదల శాఖకు అప్పగించాలని చెప్పారు. బిహెచ్ఇఎల్ అధికారులతో సమావేశమై అవసరమైన మోటార్లను వెంటనే తెప్పించి, బిగించే పనులను పర్యవేక్షించాలని నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ను సిఎం కోరారు. విద్యుత్ శాఖ అధకారులతో ఎప్పటికప్పుడు సమన్వయంతో వ్యవహరించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేవారు.
    Published by:Kishore Akkaladevi
    First published:January 23, 2021, 19:18 IST