Home /News /telangana /

COMPLAINT AGAINST PRIVATE HOSPITALS WHO COLLECTS ADDITIONAL FEE FOR COVID TREATMENT VRY

corona Bills : ఆస్పత్రులు అడ్డగోలుగా బిల్లులు వసూలు చేస్తున్నాయా? ఈ నెంబర్ కు ఫోన్ చేసి కంప్లెయింట్ చేయండి.

ఆస్పత్రులు అడ్డగోలుగా బిల్లులు వసూలు చేస్తున్నాయా? ఈ నెంబర్ కు ఫోన్ చేసి కంప్లెయింట్ 
చేయండి.

ఆస్పత్రులు అడ్డగోలుగా బిల్లులు వసూలు చేస్తున్నాయా? ఈ నెంబర్ కు ఫోన్ చేసి కంప్లెయింట్ చేయండి.

corona Bills : ప్రైవేటు ఆసుపత్రుల్లో అడ్డగోలుగా బిల్లులు వసూలు చేస్తున్నారా..? ప్రభుత్వం నిర్ధారించిన ధరలు కాకుండా ఇష్టం వచ్చిన ఫీజులు వసూలు చేస్తున్నారా..అయితే మీ కోసమే ఈ నంబర్...వెంటనే ఫిర్యాదు చేయండి..

కరోనాతో దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుజీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే రోగుల బలహీనతను ఆసరా చేసుకుంటున్న ఆసుపత్రులలతో పాటు రోగ నిర్థారణ చేసే డయాగ్నస్టిక్ సెంటర్‌ల దోపిడికి తెర తీశాయి. అందినకాడికి దండుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్నాయి.

అయితే ఇలాంటీ ఆగడాలకు చెక్ పెట్టేందుకు అటు ప్రభుత్వ అధికారులు ఇటు ప్రజా ప్రతినిధులు రంగంలోకి దిగారు. ఇప్పటికే కొవిడ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు పోలీసులు రంగప్రవేశం చేశారు. ముందుగా కరోనా చికిత్సకు అధిక ఫీజుల వసూలు చేస్తున్న వారిపై కొరడా ఝలిపిస్తున్నారు.పలు జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్‌లు నియమించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.. ఇలా ఇప్పటికే మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లిన పలు ఆసుపత్రులపై కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

ట్విట్టర్ ద్వార పిర్యాదులు తీసుకుంటున్న కేటిఆర్ ఉదయం నుండి కరోనా భాదితుల పిర్యాధులకు స్పందిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆసుపత్రుల ఆగడాలపై నిఘా పెట్టాలని సూచించారు. ఇందులో బాగంగానే పలు జిల్లాల్లో కొవిడ్ పరీక్షలపై కూడ మంత్రులు చొరవ తీసుకుని ధరలు నిర్ణయించారు. ఇలా మహాబుబ్‌నగర్ జిల్లాల్లో కొవిడ్ పరీక్ష నిర్ధారణకు తీసుకునే స్కానింగ్‌ను కేవలం 2000 రూపాలయలకే తీయాలని స్థానిక డయాగ్నోసిస్ సెంటర్ల యాజమాన్యాలతో చర్చలు జరిపి ఆదేశాలు జారీ చేశారు. ఇలా మంత్రి కేటీఆర్ అనుచరులుగా ఎమ్మెల్యేలు సైతం రంగంలోకి దిగి తమ వంతు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే చికిత్స అందించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు.

దీంతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై 9154170960‌ పిర్యాధు చేయాలని సూచించారు. కాగా ప్రభుత్వ నిర్ణయించిన ఫిజుల ప్రకారం సాధారణ బెడ్ కి4000వేలు, ఆక్సిజన్‌తో కూడిన బెడ్‌కు 6500 కాగా వెంటిలెటర్ పై ఉంచితే 9000 వసూలు చేయాలని నిర్ణయించింది. ఇక సీటి స్కానింగ్‌కు ఫిల్మ్ తో అయితే 2500 లేదంటే 2000 రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించింది.
Published by:yveerash yveerash
First published:

Tags: Corona, Private hospitals

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు