హైదరాబాద్: మారథాన్ కోసం ట్రాఫిక్ మళ్లింపు.. వాహనదారుల తీవ్ర ఇక్కట్లు..

Hyderabad News: హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఆదివారం ఉదయం చేపట్టిన మారథాన్ వివాదానికి తెరతీసింది. ఎయిర్‌టెల్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డు నుంచి గచ్చిబౌలి వరకు చేపట్టిన ఫుల్ మారథాన్ వల్ల ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడ నిలిపివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

news18-telugu
Updated: August 25, 2019, 7:41 AM IST
హైదరాబాద్: మారథాన్ కోసం ట్రాఫిక్ మళ్లింపు.. వాహనదారుల తీవ్ర ఇక్కట్లు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఆదివారం ఉదయం చేపట్టిన మారథాన్ వివాదానికి తెరతీసింది. ఎయిర్‌టెల్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డు నుంచి గచ్చిబౌలి వరకు చేపట్టిన ఫుల్ మారథాన్ వల్ల ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడ నిలిపివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దారులు మళ్లించడంతో ఉదయం పూట పనులకు వెళ్లే వాళ్లు తీవ్ర అసహనానికి లోనయ్యారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. నెక్లెస్ రోడ్డు, తెలుగు తల్లి ఫ్లైఓవర్, రాజ్‌భవన్ రోడ్డు నుంచి.. జూబ్లీ చెక్ పోస్టు.. ఇలా పలు చోట్ల ట్రాఫిక్‌ను నిలిపి వేశారు. మారథాన్ కోసం అని గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ పైకి వాహనదారులను అనుమతించలేదు. దీంతో పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. మారథాన్ వల్ల దారిని మళ్లించారని, దీంతో తమ పనులకు వెళ్లని పరిస్థితి ఏర్పడిందని అసహనం వ్యక్తం చేశారు. కాగా, ఈ మారథాన్‌ను ఉదయం 5:30కి సీపీ అంజనీకుమార్, దానకిషోర్ ప్రారంభించారు.

ఈ మారథాన్ ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌, రాజ్‌భవన్‌ రోడ్డు, రాజీవ్‌గాంధీ స్టాచ్యూ, సీఎం క్యాంపు ఆఫీసు, పంజాగుట్ట ఫ్లైఓవర్‌, శ్రీనగర్‌ కాలనీ, టీ జంక్షన్‌, సాగర్‌ సొసైటీ, ఎన్టీఆర్‌ భవన్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, పెద్దమ్మ టెంపుల్‌, కావూరి హిల్స్‌ ఎక్స్‌రోడ్‌ ,అక్కడ నుంచి లెఫ్ట్‌ టర్న్‌ తీసుకొని మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి ఇమేజ్‌ హాస్పిటల్‌, సైబర్‌ టవర్స్‌, అక్కడి నుంచి లెఫ్ట్‌ టర్న్‌ తీసుకొని.. కేఎఫ్‌సీ, ట్రిడెంట్‌ఈ హోటల్‌, లెమన్‌ట్రీ, మైండ్‌స్పేస్‌ అండర్‌ పాస్‌ ద్వారా ఐకియా, మై హోం , బయోడైవర్సీటీ ఎక్స్‌రోడ్‌, ఇక అక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకుని సైబారాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం, గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ రైట్‌ సైడ్‌ నుంచి ఇందిరానగర్‌, హిమగిరి హాస్పిటల్‌, ఐఐటీ జంక్షన్‌, విప్రో వద్ద రైట్‌ టర్న్‌ తీపుకొని క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్నపల్లి ఎక్స్‌రోడ్‌, అక్కడ రైట్‌ టర్న్‌ తీసుకొని హెచ్‌సీయూ వెస్ట్రన్‌ గేట్‌, యూనివర్సిటీ రెండవగేట్‌ వద్ద రైట్‌ టర్న్‌ తీసుకొని గచ్చిబౌలి స్టేడియం గేట్‌ నెంబర్‌-2 నుంచి హెచ్‌సీయూ రైట్‌ టర్న్‌ తీసుకున్న రన్నర్‌లు చివరకు మధ్యాహ్నం 12:00గంటలకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంకు చేరుకుంటారు.

First published: August 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు