హోమ్ /వార్తలు /తెలంగాణ /

బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం.విద్యార్థినులపై కాలేజీ స్టాఫ్ లైంగిక వేధింపులు..విచారణ కమిటీ ఏర్పాటు

బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం.విద్యార్థినులపై కాలేజీ స్టాఫ్ లైంగిక వేధింపులు..విచారణ కమిటీ ఏర్పాటు

బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం

బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం

బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. రోజూ ఏదో ఒక విషయంపై వివాదాలు నిత్యకృత్యమయ్యాయి. మొన్నటి వరకు హాస్టల్ కోసం విద్యార్థులు ఆందోళనకు దిగగా తాజాగా ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. కాలేజీ విద్యార్థినులపై స్టాఫ్ లైంగికంగా వేధింపులకు పాల్పడడం ఇప్పుడు కలకలం రేపుతోంది. దీనిపై విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో బయటకు వచ్చింది. దీనిపై స్పందించిన ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి కారణమైన ఇద్దరు అధికారుల ఫోన్లు సీజ్ చేయడమే కాకుండా వారిని సస్పెండ్ చేసింది. అలాగే దీనిపై విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Nirmal

బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT)కాలేజీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. రోజూ ఏదో ఒక విషయంపై వివాదాలు నిత్యకృత్యమయ్యాయి. మొన్నటి వరకు హాస్టల్ కోసం విద్యార్థులు ఆందోళనకు దిగగా తాజాగా ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. కాలేజీ విద్యార్థినులపై స్టాఫ్ లైంగికంగా వేధింపులకు పాల్పడడం ఇప్పుడు కలకలం రేపుతోంది. దీనిపై విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో బయటకు వచ్చింది. దీనిపై స్పందించిన ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి కారణమైన ఇద్దరు అధికారుల ఫోన్లు సీజ్ చేయడమే కాకుండా వారిని సస్పెండ్ చేసింది. అలాగే దీనిపై విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

Big News: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్..ఓ వైపు నోటీసులు..మరోవైపు రిమాండ్ పొడిగింపు

విద్యార్థిని ఫిర్యాదుతో వెలుగులోకి..

తనను ఇద్దరు అధికారులు వేధిస్తున్నారని ఓ విద్యార్థిని ట్రిపుల్ ఐటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అకౌంటెంట్ సెక్షన్ లోని ఓ అధికారితో పాటు మరో అధికారిపై ఆమె ఫిర్యాదులో పేర్కొంది. విద్యార్థిని ఫిర్యాదుపై అధికారులు దృష్టి సారించారు. ఆ అధికారులు ఎవరా అని ఆరా తీశారు. ఆ ఇద్దరి అధికారులను వర్సిటీ అధికారులు విచారించారు. అయితే ఫిర్యాదు చేసిన విద్యార్థిని తమ బంధువని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒకరు చెప్పుకొచ్చారు. అయితే విద్యార్థి మాత్రం తమకు అతనికి ఎలాంటి బంధుత్వాలు లేవని చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయం ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్యను అడగగా ఆ విద్యార్థినికి తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. దీనితో అధికారులు ఇద్దరు అధికారుల ఫోన్ లను సీజ్ చేశారు. అంతేకాదు వారిని సస్పెండ్ చేసి విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

TS Jobs 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.., మెడికల్ ఆఫీసర్ జాబ్స్‌కి నోటిఫికేషన్.. వివరాలివే..!

అవుట్ పాస్ ల విషయంలో పరిచయం..

ట్రిపుల్ ఐటీ కాలేజీ నుండి బయటకు వెళ్ళడానికి కావాల్సిన ఔట్ పాస్ విషయంలో విద్యార్థినితో అక్కడి అధికారుకి పరిచయం ఏర్పడింది. ఇక అప్పటి నుండి అధికారి విద్యార్థిని వేధిస్తున్నట్లు తెలుస్తుంది. విద్యార్థిని ఫిర్యాదుతో అధికారులు అలెర్ట్ అయ్యి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలకు సిద్ధమయ్యారు.

గతంలో సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళన..

కాగా గతంలో ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ ఆందోళనలు అప్పట్లో వార్తల్లోకెక్కాయి. కాగా ఈ విషయంలో మంత్రి కేటీఆర్ కల్పించుకొని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని తెలిపారు. దీనితో విద్యార్థులు ఆందోళన విరమించారు.

First published:

Tags: Basara, Basara IIIT, Basara triple IT, Nirmal, Telangana

ఉత్తమ కథలు