హోమ్ /వార్తలు /తెలంగాణ /

Owaisi : దమ్ముంటే రా..హైదరాబాద్ నుంచి పోటీచేయాలని రాహుల్ కి ఓవైసీ సవాల్

Owaisi : దమ్ముంటే రా..హైదరాబాద్ నుంచి పోటీచేయాలని రాహుల్ కి ఓవైసీ సవాల్

రాహుల్ కి ఓవైసీ సవాల్

రాహుల్ కి ఓవైసీ సవాల్

Owaisi dares Rahul : తెలంగాణలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి..ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే హైదరాబాద్ నుంచి కానీ లేక మెదక్ నుంచి పోటీచేయాలని శనివారం ఓవైసీ సవాల్ విసిరారు.

Owaisi dares Rahul : తెలంగాణలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి..ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే హైదరాబాద్ నుంచి కానీ లేక మెదక్ నుంచి పోటీచేయాలని శనివారం ఓవైసీ సవాల్ విసిరారు. శనివారం ఓవైసీ ఓ జాతీయ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.."ప్రస్తుతం రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో వయనాడ్ లో రాహుల్ ఓడిపోవడం ఖాయం. కాబట్టి రాహుల్ గాంధీ హైదరాబాద్ నుంచి పోటీ చేసి రాహుల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. హైద‌రాబాద్ కాదంటే మెదక్ లోక్ సభ నుంచి కూడా రాహుల్ గాంధీ పోటీ చేయవచ్చు"అని అన్నారు. టీఆర్ఎస్‌, బీజేపీతో స‌హా ఒవైసీని స‌వాల్ చేసేందుకే తాను తెలంగాణ‌కు వ‌చ్చాన‌ని తెలంగాణ పర్యటనలో రాహుల్ గాంధీ పేర్కొన‌డంతో ఒవైసీ పై విధంగా స్పందించారు.

కాగా,అసదుద్దీన్ ఓవైసీ 2004 నుంచి హైదరాబాద్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. మరోవైపు, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గతంలో మెదక్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సొంత జిల్లా మెదక్.

ALSO READ Two Girls Love : గాఢమైన ప్రేమలో ఇద్దరమ్మాయిలు..పెళ్లికి పెద్దలు ఒప్పుకోపోవడంతో జంప్

వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ ఎన్నికలకు రాహుల్ గాంధీ ఎన్నికల శంఖారావం మోగించారు. తెలంగాణాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు శుక్రవారం వరంగల్ లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో రైతుల ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ..టీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తును ఉండబోదని,ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోరాడతామని తేల్చిచెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.., ప్రజల మాట వినని ‘రాజు’ అని విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రజల సమస్యలు వింటాడని..కానీ రాజు అవేమీ వినడని.. తాను చేయాలనుకున్నది చేస్తాడని విమర్శించారు. తాము అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌లో రైతుల రుణమాఫీ చేశామని.. వరికి రూ. 2500 మద్దతు ధర ఇస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమవుతుందని సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. తెలంగాణ(Telangana) ఏర్పాటు అంత సులువుగా జరగలేదని.. తమకు నష్టం జరుగుతందని తెలిసి కూడా కాంగ్రెస్(Congress) ఇక్కడి ప్రజల కోసం నిర్ణయం తీసుకుందని రాహుల్ గాంధీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం లేదని రాహుల్ విమర్శించారు.


ALSO READ CM Stalin : సాధారణ ప్రయాణికుడిలా బస్సు ఎక్కి ప్రయాణికులతో ముచ్చటించిన సీఎం స్టాలిన్

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పని చేస్తాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి లేదని.. అందుకే ఢిల్లీలో ఉంటూ రిమోట్ ద్వారా ఇక్కడి ప్రభుత్వాన్ని నడిపిస్తుందని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉండాలని బీజేపీ భావిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. ఎంత పెద్ద నాయకుడైనా సరే.. రైతులకు అండగా ఉండని వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదని ఆయన స్పష్టం చేశారు.

First published:

Tags: Asaduddin Owaisi, Hyderabad, Rahul Gandhi, Telangana

ఉత్తమ కథలు