స్యూరాపేట నుంచి కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర ప్రారంభం..

కల్నల్ సంతోష్ బాబు

ప్రజల సందర్శన అనంతరం ఉదయం 9.15 గంటల వరకు ప్రజలు సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభమయ్యింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యానగర్‌లోని సంతోష్ బాబు స్వగృహం నుంచి అంతిమయాత్రగా బయలుదేరారు.

  • Share this:
    భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర సూర్యాపేట నుంచి ప్రారంభమయ్యింది. ప్రజల సందర్శన అనంతరం ఉదయం 9.15 గంటల వరకు ప్రజలు సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభమయ్యింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యానగర్‌లోని సంతోష్ బాబు స్వగృహం నుంచి అంతిమయాత్రగా బయలుదేరారు. సూర్యాపేట పట్టణంలోని ఎంజీ రోడ్డు, శంకర్ విలాస్ సెంటర్, రైతు బజార్, పాత బస్టాండ్, కోర్టు చౌరస్తా, ఎస్పీ కార్యాలయం మీదుగా కేసారంలోని వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర సాగనుంది. అయితే అడుగడుగునా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నివాళ్లర్పించారు. ప్రజలు భవనాలపై నుంచి పూలు చల్లుతూ, జాతీయ జెండాలు పట్టుకుని సంఘీభావం ప్రకటించారు. సూర్యాపేట పట్టణంలోని వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించారు.
    Published by:Narsimha Badhini
    First published: