COLLECTOR ADVISED THE OFFICIALS THAT EVERYONE SHOULD BE PARTNERS IN THE TREE PLANTING TO BE HELD TOMORROW MDK VB
Telangana News: ప్రతీ మండలంలో 50 వేల మొక్కలే లక్ష్యం.. రేపటి కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరం..
సిద్దిపేట కలెక్టర్
Telangana News: సిద్దిపేట జిల్లాలో ఈ నెల 24 వ తేదీన చేపడుతున్న ముక్కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యేలా చూడాలని.. గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున ప్లాంటేషన్ చేపట్టి కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ పి వెంకట్రామ రెడ్డి అధికారులకు సూచించారు.
సిద్దిపేట జిల్లాలో ఈ నెల 24 వ తేదీన చేపడుతున్న ముక్కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యేలా చూసి గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున ప్లాంటేషన్ చేపట్టి కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ పి వెంకట్రామ రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లాలో ఈ నెల 24 వ తేదీన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం, తెలంగాణకు హరిత హరం పై జిల్లా కలెక్టర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు, అన్ని మండలాల ఎంపిడివో లు, DLPO, APOలు, పంచాయితీ సెక్రటరీ ల తో IDOC నుండి జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
ప్రతి మండలంలో కనీసం 50 మొక్కలను నాటేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. అలాగే అటవీ శాఖ, పురపాలిక లలో ఏడో విడత లో నిర్దేశించిన మొక్కలు నాటే లక్ష్యం ను పూర్తి చేయాలన్నారు. గ్రామాలు, మండలాలు, పట్టణాలలో నిర్వహించే ముక్కోటి వృక్షారాచ్చన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ప్రజా భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. మండల కేంద్రాలలో బృహత్ పల్లె ప్రకృతి వనాల లో సంతృ ప్త స్థాయిలో మొక్కలు నాటాలన్నారు. డంప్ యార్డ్ లు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. ఇప్పటికే ఉన్న పల్లె ప్రకృతి వనంలో పూర్తి స్థాయిలో మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమం కు సంబంధించి వివరాలు, ఫోటో డాక్యుమెంటేషన్ అదే రోజు DRDO,అటవీ శాఖ అధికారులకు అందించాలన్నారు.
ఆన్లైన్ లో కూడ అప్ లోడ్ చేయాలన్నారు. వర్షాలు తగ్గు ముఖం పట్టిన వెంటనే రాజీవ్ రహదారి ప్లాంటేషన్ ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అందుకు అవసరమైన సామగ్రిని వెంటనే సమకూర్చు కావాలని కలెక్టర్ ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్, DFO శ్రీధర్ , DRDO dpo గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.