హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar : ఫుట్‌పాత్‌ వ్యాపారులపై కొరఢ.. ఫుట్‌పాత్‌లు ఖాలీ చేయాలని హుకుం...

Karimnagar : ఫుట్‌పాత్‌ వ్యాపారులపై కొరఢ.. ఫుట్‌పాత్‌లు ఖాలీ చేయాలని హుకుం...

పుట్‌పాత్ లను పరీశిస్తున్న కలెక్టర్

పుట్‌పాత్ లను పరీశిస్తున్న కలెక్టర్

Karimnagar : కరీంనగర్‌లో ఆదివారం జరిగిన ఆక్సిడెంట్‌లో నలుగురు మృతి చెందడంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. నగరంలోని ఫుట్‌పాత్‌ వ్యాపారులపై కొరఢ ఝలిపించారు.

ఫుట్‌పాత్ వ్యాపారులు నలుగురు మృతి చెందిన తర్వాత గాని కరీంనగర్ జిల్లా అధికారుల్లో కదలిక రాలేదు. కారు ప్రమాదంలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడంతో జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో జిల్లా ఉన్నతాధికారులతో పాటు ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు.

సోమవారం సాయంత్రం నగరంలోని అలుగునూర్, గీత భవన్, రామ్ నగర్ లోని ఆయుష్ ఆస్పత్రి వద్ద, ఎస్ ఆర్ ఆర్ కాలేజ్, ఆదర్శనగర్, క్లాక్ టవర్ ప్రధాన రోడ్ల వెంట పుట్ పాత్ లను పోలీస్ కమి ష నర్ సత్యనారాయణతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా స్మార్ట్ సిటీ నిర్మాణంలో భాగంగా విశాలంగా ప్రధాన రోడ్లు, రోడ్ల ప్రక్కన ఫుట్ పాత్ లను నిర్మించామని అన్నారు. ఫుట్ పాత్ లు కేవలం ప్రజలు నడచుటకు మాత్రమేనని ఆయన తెలిపారు . ఆదివారం కరీంనగర్ కమాన్ వద్ద జరిగిన పెద్ద దుర్ఘటనలో ఫుట్ పాత్ ల వద్ద కొలిమి పని చేసుకుంటున్నా వారు నలుగురు మరణించారని , ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎవరు కూడా ఫుట్ పాత్ లను ఆక్రమించు కోకూడదని అన్నారు.

Khammam : ప్రసవ సమయంలో భార్య పక్కనే భర్త, శిశువు బొడ్డును కట్ చేసేది ఆయనే... తెలంగాణలో సరికొత్త విధానం

కొందరు చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, పండ్ల వ్యాపారులు ఫుట్ పాత్ లపై అమ్మకాలు జరుపుతున్నారని ఇది నగర ప్రజలకు చాలా ఇబ్బందికరమైనదని అన్నారు. ఫుట్ పాత్ లను ఆక్రమించుకున్న వారు వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ సిబ్బంది ,పోలీస్ రెవెన్యూ సిబ్బంది తో తనఖీ బృందాలను ఏర్పాటు చేసి ఫుట్ పాత్ ల పై వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

పుట్ పాత్ లను ఆక్రమించుకొని చిరు వ్యాపారాలు చేసే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పోలీసు కమిషనర్ సత్యనారయణ హెచ్చరించారు.. నగరంలోని ఫుట్ పాత్ లను ఆక్రమించుకున్న వారు ఖాళీ చేయాలని హుకుం జారీ చేశారు. సోమవారం నుండి ప్రత్యేక టీములతో పుట్ పాత్ లపై వ్యాపారాలు చేసే వారిని గుర్తించి ఆక్రమణలు తొలగిస్తాం అన్నారు.


కాగా ఆదివారం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు డబుల్ బెడ్ రూంలు కేటాయిస్తామని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. పుట్‌పాత్‌లపై వ్యాపారం నిర్వహించేవారు రాజకీయాలు చేయకుండా ఖాలీ చేయాలని ఆయన చెప్పారు.

First published:

Tags: Collector, Karimangar

ఉత్తమ కథలు