Home /News /telangana /

COLDWAR BETWEEN MLC KAVITA AND MINISTER PRASHANTH REDDY IN NIAZAMABAD NZB VRY

Nizamabad :‌ టీఆర్ఎస్‌లో కోల్డ్ వార్... ఎమ్మెల్సీ, మంత్రి మ‌ధ్య ఆధిపత్య పోరు..

Nizamabad :‌ టీఆర్ఎస్‌లో కోల్డ్ వార్...

Nizamabad :‌ టీఆర్ఎస్‌లో కోల్డ్ వార్...

Nizamabad : నిజామాబాద్‌ జిల్లాలో ఎమ్మెల్సీ కవితా మరోసారి చక్రం తిప్పుతుందా.. ఇన్నాళ్లు స్థబ్ధుగా ఉన్నా ఆమె తిరిగి తన పట్టును బిగిస్తుందా.. అందుకే జిల్లా మంత్రికి ఆమెకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయా..?

  నిజామాబాద్ జిల్లా, న్యూస్18తెలుగు ప్ర‌తినిధి పి మ‌హేంద‌ర్,

  టీఆర్ఎస్ కంచుకోట అయినా నిజామాబాద్ జిల్లాలో అదిప‌త్య పోరు.. కొనసాగుతుంది. సీఎం త‌న‌య‌ ఓ వైపు సీఎం న‌మ్మిన బంటు మ‌రోవైపు ఇద్ద‌రి మ‌ద్య కోల్డ్ వార్...నడుతుస్తుంది. పైకి మాత్రం పార్టీ అధిష్ఠానం వద్ద అంతా బాగుంద‌ని చెబుతున్నా..జిల్లాలో మాత్రం ఎవ‌రికి వారే య‌మున తీరే అన్న చందంగా ఉంది ప‌రిస్థితి.. ఇటీవల జరిగినా.. జరుగుతున్నా.. పరిణామాలతో జిల్లాలో ఉన్న లుకలుకలు బహిర్గతమవుతాయి..

  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తోమ్మిది నియోజ‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ 2014లో తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలతోపాటు రెండు ఎంపీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. అయితే 2018 అసేంబ్లీ ఎన్నిక‌ల్లో 8 స్థానాల‌ను గెలుచుకుంది.. ఒక యేల్లారెడ్డి నియోజ‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపోందింది.. తిరిగి ఆ ఒక్క స్థానాన్ని గులాబి గూటికి చేరింది.. 2019 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో నిజ‌మాబాద్ పార్ల మెంట్ స్థానం నుంచి పోటిచేసిన క‌విత ఓట‌మి పాల‌య్యారు.. జ‌హిర‌బాద్ ఎంపి స్థానాన్ని టీఆర్ఎస నిల‌బెట్టుకుంది..

  సీఎం త‌న‌య క‌ల్వ‌కుంట్ల క‌విత ఓట‌మి త‌రువాత జిల్లా వ్య‌వ‌హ‌రాల‌కు దూరంగా ఉంది.. దీంతో 2018 లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల త‌రువాత జిల్లా నుంచి రాష్ట్ర మంత్రిగా వేముల ప్రశాంత్ రెడ్డి అవకాశం దక్కింది.. సీనియార్ మోస్ట్ నాయ‌కుడైన‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభాపతి కావడం.. ఎంపి గా కవిత ఓటమి పాలవడంతో ప్రశాంత్ రెడ్డికి ఆడ్డులేకుండా పోయింది.. ఆయ‌న చెప్పిందే వేదం అన్న‌ట్టుగా సాగింది.. ఈ క్రమంలోనే వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అధికార యంత్రాంగంలో పట్టు సాధించారు.. జిల్లా కలెక్టర్ల బదిలీల నుంచి ఏది జరగాలన్నా అంతా వేముల చెప్పినట్లుగానే జరుగుతోంది..

  అయితే పోయిన చోటే వెతుక్కోవాలి అన్న‌ట్టుగా గ‌త‌ ఏడాది స్థానిక సంస్థాల శాసన మండలి ఉప ఎన్నిక‌ల్లో ఎమ్మేల్సీగా కవిత గెలుపొందారు.. కవిత ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత వేముల ఆధిపత్యానికి మొదటిసారిగా బ్రేకులు ప‌డడ్డాయి.. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కవిత పెద్దగా పట్టించుకోలేదు.. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ తో ఉన్న చనువుతో వేముల తన ఆధిపత్యాన్ని కొనసాగించారు.. ఆయన చెప్పిందే వేదం అన్న‌ట్టుగా రెండు జిల్లాల్లో పనులు జరిగాయి.. కానీ ఎప్పుడు ఎం జ‌రుగుతుందో ఎవ‌రు చెప్ప‌గ‌ల‌రు అన్న‌ట్టుగా వేముల ప‌రిస్థితి మారిపోయింది..

  రెండో విడత క‌రోనాకి ముందు కవిత నెలలో ఐదు రోజులు ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండేవిధంగా కార్య‌చ‌ర‌ణ చేసుకున్నారు.. అయితే క‌విత జిల్ల‌ాలో ఉండ‌డం మంత్రి వేముల‌కు నచ్చలేదట....! అప్ప‌టి నుంచి కవిత నిజామాబాద్ లో పెట్టుకున్న‌ ఏ కార్యక్రమానికి వేముల హాజరు కావడం లేదు.. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వారు న‌డుస్తుంద‌ని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. మ‌రోవైపు కవిత లేని సమయంలో జిల్లాలో నామినేటెడ్ పదవులు మంత్రికి కావాల్సిన వారికి ఇప్పించార‌ని ప్రచారం కూడా జ‌రుగుతంది..

  అయితే ఇటీవల ఎమ్మేల్సీ కవిత ప‌ట్టుబ‌ట్టి రూర‌ల్ ఎమ్మేల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఆర్టీసీ చైర్మన్ ప‌ద‌వి ఇప్పించుకోవ‌డంతో ఇద్దరి మ‌ద్య ఆధిప‌త్య పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారింది.. దీంతో జిల్లాలో కేసిఆర్ తనయ క‌ల్వ‌కుంట్ల క‌విత ప‌ట్టు సాదించ‌డంతో పార్టీ శ్రేణులు, అధికారులు ఎవ‌రి మాటా వినాలి అనే విష‌యం చ‌ర్చ‌నీయ ఆంశంగా మారింది.. ఈ ఆదిపత్య పోరులో ఎవరు ఎటువైపు ఉండాలో తెలియక చాలామంది నాయకులు తికమక పడడం పార్టీకి మరోసారి ఇబ్బందికర పరిణామంగా అవకాశాలు ఉన్నట్టు స్థానిక నేతలు భావిస్తున్నారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Kalvakuntla Kavitha, Nizamabad, Trs

  తదుపరి వార్తలు