హోమ్ /వార్తలు /తెలంగాణ /

Biryani Hotel seize: కమిషనర్ బిర్యానీలో బొద్దింకలు.. ఖంగుతిన్న అధికారి​.. హోటల్​ సీజ్

Biryani Hotel seize: కమిషనర్ బిర్యానీలో బొద్దింకలు.. ఖంగుతిన్న అధికారి​.. హోటల్​ సీజ్

కమిషనర్​ సీజ్​ చేసిన లక్ష్మీ గ్రాండ్​ హోటల్​

కమిషనర్​ సీజ్​ చేసిన లక్ష్మీ గ్రాండ్​ హోటల్​

మునిసిపల్ కమిషనర్కే బొద్దింకలతో కూడిన బిర్యానీని వడ్డించిన వైనం నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆకలిగా ఉందని జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గ్రాండ్ హోటల్కు వెళ్లిన కమిషనర్ బాలకృష్ణ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే ఆ బిర్యానీలో బొద్దింకలు చూసి కమిషనర్ షాక్ అయ్యారు.

ఇంకా చదవండి ...

ఆకలిగా ఉందని సమీపంలోని ఓ హోటల్​కు తినడానికి వెళ్లిన మునిసిపల్​ కమిషనర్​కు అక్కడి సిబ్బంది షాక్​ ఇచ్చారు. ఆయనకు వేడి వేడిగా బొద్దింకలు కలిసిన బిర్యానీని హోటల్​ నిర్వాహకులు వడ్డించారు. అప్పటికే ఆకలితో ఉన్న కమిషనర్​ తన ప్లేట్​లో బొద్దింకలు చూసి ఖంగుతిన్నారు. అసలు హోటల్​లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు తన సిబ్బందితో కలిసి వంటగది, తదితరాలను తనిఖీ చేశారు. హోటల్​ను తనిఖీ చేసిన మునిసిపల్​ కమిషనర్​ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు హోటల్​ యాజమాన్యం కొంచెం కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదని ఆయన గ్రహించారు. వెంటనే హోటల్​ని మూయించేశారు. మరోవైపు హోటల్​ నిర్వాహకుల తీరుపై అక్కడికి తినడానికి వచ్చిన కస్టమర్లు సైతం మండిపడ్డారు. ఇటీవలె బిర్యానీలో పురుగులు రావడంతో మేడ్చల్​ జిల్లా ఫిర్జాదీగూడ మునిసిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని ప్యారడైజ్​ పేరుతో నడుస్తున్న రెస్టారెంట్​ను అధికారులు సీజ్​ చేశారు. ఆ ఘటన మరిచిపోకముందే నిర్మల్ జిల్లా​లో కమిషనర్​ ఆర్డర్​ చేసిన బిర్యానీలో బొద్దింకలు రావడం చర్చనీయాంశమైంది.


వివరాల్లోకెళితే..  తెలంగాణలోని నిర్మల్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, తన సిబ్బందితో కలిసి భోజనం చేసేందుకు నిర్మల్​ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ కు వెళ్లారు. ఆ హోటల్​ పేరు లక్ష్మీ గ్రాండ్ హోటల్. పేరుకు తగ్గట్లే హోటల్​ చాలా గ్రాండ్​గా కనిపిస్తుంది. తనకు సిబ్బందికి కలిపి కమిషనర్​ చికెన్​ బిర్యాని ఆర్డరిచ్చారు. కొద్దిసేపటికే హోటల్​ సిబ్బంది కూడా వినమ్రంగా బిర్యానీ తెచ్చి  వడ్డించారు. అసలే ఆకలిగా ఉన్న కమిషనర్​, సిబ్బంది తినడానికి సిద్ధమయ్యారు. అయితే తన ప్లేట్​లో బిర్యానీ చూసి కమిషనర్​ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఆయనకు వడ్డించిన బిర్యానిలో బొద్దింకలు, పురుగులు బయటపడ్డాయి. దీంతో ఆగ్రహించిన కమిషనర్​ ఆ హోటల్​లోని వంటగదిని సిబ్బందితో కలిసి తనిఖీ చేశాడు. అక్కడ పూర్తిగా కుళ్లిన, అపరిశుభ్రమైన మాంసాన్ని వండుతున్నట్లు గుర్తించారు. ఇక హోటల్​ ఫ్రిజ్​లో ఉంచిన చికెన్ కు బూజు పట్టి ఉండటం కమిషనర్ గమనించారు. అంతేకాకుండా కిచెన్​లోని పలు ఆహార పదార్థాలు కలుషితమయ్యాయని గుర్తించారు. అదే ఆహారాన్ని వండి కస్టమర్లకు వడ్డిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వంటగది మొత్తం తిరిగిన కమిషనర్​కు ఎక్కడ చూసినా అపరిశుభ్రతే కనిపించింది. దీంతో రెస్టారెంట్​ యాజమాన్యం ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆయన నిర్ధారణకు వచ్చారు.

చర్యలు తప్పవు..

సాక్షాత్తూ కమిషనర్​కే బొద్దింకలతో ఉన్న ఆహారాన్ని వడ్డించడంతో ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. అప్పటికప్పుడు హోటల్​పై  కమిషనర్​ బాలకృష్ణ చర్యలు తీసుకున్నారు. లక్ష్మీ గ్రాండ్ హోటల్​ను సీజ్ చేశారు. రూ.50 వేలు జరిమానా సైతం విధించారు. అంతేకాకుండా ఎవరైనా సరే హోటల్​, రెస్టారెంట్లలో ఇలాగే నాణ్యత లేని ఆహార పదార్థాలను ఉపయోగిస్తే సీజ్ చేస్తామని కమిషనర్​హెచ్చరించారు.

First published:

Tags: Adilabad, Chicken biryani, Telangana

ఉత్తమ కథలు