యాదాద్రి లడ్డూ ప్రసాదంలో బొద్దింక.. భక్తుల ఆగ్రహం

యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో లడ్డూ ప్రమాదంలో బొద్దింక కనిపించింది.

news18-telugu
Updated: December 8, 2019, 4:26 PM IST
యాదాద్రి లడ్డూ ప్రసాదంలో బొద్దింక.. భక్తుల ఆగ్రహం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో లడ్డూ ప్రమాదంలో బొద్దింక కనిపించింది. ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూను తింటుండగా, అందులో చనిపోయిన బొద్దింక కనిపించింది. దీనిపై భక్తులు మండిపడుతున్నారు. లడ్డూలో బొద్దింక గురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల యాదాద్రి ఆలయం వివాదాల్లో చిక్కుకుంటోంది. చినజీయర్ స్వామి ఆగమ పర్యవేక్షణలో పునర్నిర్మాణం చేపడుతున్నప్పటికీ.. ఆర్కిటెక్టులు,శిల్పులు వారి అనుమతి లేకుండానే స్వయంభువు విగ్రహంలో మార్పులు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. శిలపై వెలసినట్టుగా ఉండే నరసింహాస్వామి మూలవిరాట్టు విగ్రహాన్ని తాకడమే కాకుండా.. విగ్రహ ఆకారంలో మార్పు చేశారన్న చర్చ జరుగుతోంది. గతంలో స్వామి తలపై ఉండే ఏడు తలల ఆదిశేషుడికి బదులు ఇప్పుడు ఐదు తలల ఆదిశేషుడిని పునర్నిర్మించినట్టు సమాచారం. గతంలో మూలవిరాట్టు విగ్రహం శాంతమూర్తిగా దర్శనమివ్వగా.. ఇప్పుడది ఉగ్రరూపంలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. మూలవిరాట్టుపై మందంగా ఉండే సింధూరాన్ని తొలగించడంతో విగ్రహం అలా కనిపిస్తున్నట్టు చెబుతున్నారు.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>