Home /News /telangana /

COCK KNIFE TOUCHED TO A MAN MOST SENSITIVE BODY PARTS IN JAGTIAL WHILE COCK FIGHT HERE IS WAHT HAPPEND NEXT HSN

కోడి కాలికి కత్తిని కట్టాడు.. రెండో కాలికి కూడా కడుతుండగా పరార్.. మర్మాంగాలకు తగిలిన కోడి కత్తి.. చివరకు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కోడిని తన కాళ్ల మధ్యలో పెట్టుకుని కాళ్లకు కోడికత్తులను కట్టేందుకు యత్నించాడు. అలాగే ఓ కాలికి కోడి కత్తిని కట్టాడు. రెండో కాలికి కట్టేందుకు ప్రయత్నిస్తుండగా అది తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ కోడి కాలికి కట్టిన కత్తి సతీష్ మర్మాంగాలకు తగిలింది. దీంతో..

ఇంకా చదవండి ...
    కోడిపందేలు ఓ మనిషి ప్రాణం తీశాయి. అనుకోకుండా జరిగిన ఓ ఘటన వల్ల ఓ కుటుంబం తీవ్ర విషాధంలో మునిగిపోయింది. కోడిపందేల వల్ల జరిగిన గొడవల్లో ఆ వ్యక్తి మరణించాడనుకుంటే పొరపాటే. కోడి పందేలకు కోడిని సిద్ధం చేస్తోంటే, ఊహించని రీతిలో కోడి తప్పించుకోవడానికి ప్రయత్నించే క్రమంలో అనుకోని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదమే అతడు ప్రాణాలు కోల్పోయేట్లు చేసింది. ఇంతకీ అసలేం జరిగిందంటే.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి పరిధిలోని లొత్తునూర్ శివారులో కోడి పందేలు నిర్వహించడానికి స్థానికులు సిద్ధమయ్యారు. ఈ కోడిపందేల్లో పాల్గొనేందుకు వెల్గటూరు మండలం కొండాపూర్ కు చెందిన తనుగుల సతీష్ అనే 45 ఏళ్ల వ్యక్తి కూడా వచ్చాడు. తాను ఎన్నాళ్లుగానో పెంచుకుంటున్న కోడితో సహా పందేలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నాడు.

    అప్పటికే పెద్ద సంఖ్యలో మనుషులు కోడి పందేల్లో పాల్గొనేందుకు అక్కడికి ఉత్సాహంగా వచ్చారు. వాటిని చూడటానికి వచ్చిన జనంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. ఈ క్రమంలోనే తనుగుల సతీష్ తన కోడిని పందేనికి సిద్ధం చేయాలని భావించాడు. తనతోపాటు తెచ్చుకున్న కోడి కత్తులను బయటకు తీశాడు. ఓ చోట కూర్చుని కోడిని తన కాళ్ల మధ్యలో పెట్టుకుని కాళ్లకు కోడికత్తులను కట్టేందుకు యత్నించాడు. అలాగే ఓ కాలికి కోడి కత్తిని కట్టాడు. రెండో కాలికి కట్టేందుకు ప్రయత్నిస్తుండగా అది తప్పించుకునేందుకు ప్రయత్నించింది.
    ఇది కూడా చదవండి: మాట్లాడటం మానేసిన యువతి.. ఫోన్స్ కూ నో రెస్పాన్స్.. రాత్రి పూట ఆ యువకుడు నేరుగా ఆమె ఇంటికెళ్లి..

    దాన్ని గట్టిగా పట్టుకునేందుకు సతీష్ ప్రయత్నించడం, అది తప్పించుకునేందుకు వీలును చిక్కించుకోవడం చకచకా జరిగాయి. మామూలుగా అది ఎగిరిపోతే ప్రమాదం ఏమీ జరగకపోయేదే. కానీ తప్పించుకునే క్రమంలో ఆ కోడి కాలికి కట్టిన కత్తి సతీష్ మర్మాంగాలకు తగిలింది. దీంతో అతడి పురుషాంగం, వృషణాలు బాగా దెబ్బతిన్నాయి. తీవ్ర గాయాలయి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న వాళ్లు స్పందించి జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. సతీష్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయం తెలిసి వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Cock fight, Crime news, Crime story, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు