పోలీస్ కార్యాలయంలో నాగుపాము కలకలం

రోజు వారీ కార్యక్రమాల్లో భాగంగా కార్యాలయంలో సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా.. రైటర్ రూమ్‌లో నాగుపాము కనిపించింది. బీరువా కింద పడుకున్న నాగుపామును గుర్తించి వెంటనే అధికారులకు చెప్పారు.

news18-telugu
Updated: November 8, 2019, 4:25 PM IST
పోలీస్ కార్యాలయంలో నాగుపాము కలకలం
సీఐ కార్యాలయంలో నాగు పాము
  • Share this:
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ రూరల్ సిఐ ఆఫీస్‌లో నాగుపాము హల్ చల్ చేసింది. రోజు వారీ కార్యక్రమాల్లో భాగంగా కార్యాలయంలో సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా.. రైటర్ రూమ్‌లో నాగుపాము కనిపించింది. బీరువా కింద పడుకున్న నాగుపామును గుర్తించి వెంటనే అధికారులకు చెప్పారు. వారు హుజురాబాద్‌కు చెందిన పాములు పట్టే అఫ్జల్‌కి సమాచారం అందించడంతో అతడు సీఐ కార్యాలయానికి చేరుకొని చాకచక్యంగా నాగుపామును పట్టుకున్నాడు. అనంతరం సీఐ కిరణ్, అఫ్జల్, ఇతర సిబ్బంది కలిసి ఆ పామును అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. పామును సకాలంలో గుర్తించడంతో ప్రమాదం తప్పిందని.. లేదంటే సిబ్బందిని పాము కాటువేసి ఉండేదని అధికారులు తెలిపారు. పామును పట్టుకున్న అఫ్జల్‌ని అభినందించారు.
First published: November 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>