Home /News /telangana /

CM KCR WRITES A LETTER TO PM NARENDRA MODI ON PADDY ISSUES VRY

CM KCR : ధాన్యం కొంటారా లేదా.. క్లారిటి ఇవ్వండి ? ప్రధానికి లేఖ రాసిన సీఎం కేసిఆర్

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

CM KCR : మహధర్నా చేపట్టడానికి ఒకరోజు ముందుగానే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి కేసీఆర్ లేఖ రాశారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేపట్టాల్సిన చర్యలతో పాటు తెలంగాణలో పంట ఉత్పత్తి కొనుగోలులో నెలకొన్న కన్‌ఫ్యూజన్ తోపాటు ఎఫ్‌సిఐ చేపట్టాల్సిన బాధ్యతలపై సీఎం పలు అంశాలు వివరించారు.

ఇంకా చదవండి ...
    ధాన్యం కొనుగోలు అంశంలో నెలకొన్న పరిస్థితిపై సీఎం కేసిఆర్ కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించిన ఆయన ధాన్యం కొనుగోలు చేసే విధంగా ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాల‌ని సీఎం త‌న లేఖ‌లో కోరారు. ఇక ప్రస్తుత రబీ సీజన్‌లో మిగిలిన 5 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు చేయాల‌ని విన‌తి చేశారు. ఖ‌రీఫ్‌లో 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కూడా కొనుగోలు చేయాల‌ని సీఎం ప్ర‌తిపాదించారు. పంజాబ్ లో కొనుగోలు చేస్తున్నట్టుగానే తెలంగాణ‌లో కూడా ధాన్యం సేక‌ర‌ణ చేప‌ట్టాల‌ని లేఖలో సూచించారు. మరోవైపు వ‌చ్చే ఎండకాలంలో పంటలో రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో స్ప‌ష్టం చేయాలి. ఎఫ్‌సీఐ తీరుతో రాష్ట్రాల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది. రాష్ట్రాల నుంచి సేక‌రించే మొత్తంపై ఎఫ్‌సీఐ స్ప‌ష్ట‌త ఇవ్వ‌ట్లేదు. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో వరి ఉత్ప‌త్తి పెరుగుతున్నా సేక‌రించే మొత్తం పెర‌గ‌ట్లేదని అని సీఎం లేఖ‌లో పేర్కొన్నారు.

    దేశ ప్రజలకు ఆహార భధ్రతను కల్పించే తప్పనిసరి బాధ్యతలను నెరవేర్చాల్సిన భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అసంబద్ధ విధానాలను అవలంబిస్తూ, అటు రైతులను ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను అయోమయానికి గురి చేస్తున్నదని, అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎఫ్‌సీఐ ఏడాదికి సరిపడా ధాన్యం సేకరించే లక్ష్యాలను ఒకేసారి నిర్ధారించడం లేదని చెప్పారు. ప్రతి ఏటా ధాన్యం దిగుబడి పెరుగుతున్నదని తెలిసినా ధాన్యాన్ని వేగవంతంగా సేకరించడం లేదని చెప్పారు. ఎఫ్‌సీఐ అయోమయ విధానాల వలన సరియైన పంటల విధానాన్ని రైతులకు వివరించేందుకు రాష్ట్రాలకు ప్రతిబంధకంగా మారింది. ఉదాహరణకు.. 2021 వానాకాలం సీజన్ లో తెలంగాణలో 55.75 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి అయింది. కానీ అందులో కేవలం 32.66 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే ఎఫ్‌సీఐ సేకరించింది. అంటే పండిన పంటలో కేవలం 59 శాతం ధాన్యం మాత్రమే. ఇది 2019 -20 వానాకాలంలో సేకరించిన ధాన్యం కంటే 78 శాతం తక్కువ. ధాన్యం సేకరణలో ఇటువంటి విపరీత తేడాలుంటే రాష్ట్రంలో హేతుబద్దమైన పంట విధానాలను అమలు చేయడానికి ఇబ్బందిగా మారుతుందని అని కేసీఆర్ పేర్కొన్నారు.

    ఇది చదవండి : వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్‌ను ఎలా ఆమోదిస్తారు... ? కోర్టుకు వెళతాం.


    ధాన్యం కొనుగోలులో ఉన్న అయోమయ పరిస్థితులను తొలగించి ధాన్యం సేకరణలో నిర్దిష్ట‌మైన లక్ష్యాన్ని నిర్దారించడం కోసం కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 25, 26 తేదీల్లో నేనే స్వయంగా వెళ్లి క‌లిశాను. వార్షిక ధాన్య సేకరణ లక్ష్యాన్ని తక్షణమే నిర్ధారించాలని నేను విజ్జప్తి చేశాను. కేంద్ర మంత్రికి విజ్జప్తి చేసి 50 రోజులు దాటిపోయినా ఎటువంటి సమాచారం లేదు, ఇంతవరకు ఎటువంటి విధాన నిర్ణయాన్ని తీసుకోలేదు అని కేసీఆర్ తెలిపారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CM KCR, Pm modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు