సింగరేణి తలపెట్టిన కోల్ బ్లాక్స్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని రేపటి నుండి మూడు రోజుల పాటు సింగరేణి కార్మిక సంఘాలు పిలుపునివ్వడంతోపాటు పాటు సమ్మెలోకి వెళుతున్న నేపథ్యంలోనే సీఎం కేసిఆర్ వారికి అండగా నిలబడ్డారు. ( cm kcr write a letter to pm ) కార్మికులు కోరుతున్నట్టుగా కేంద్రం వెంటనే వాటి వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు.
లేఖలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మరియు తమిళనాడులోని థర్మల్ పవర్ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలకభూమిక పోషిస్తున్నదని సిఎం లేఖలో పేర్కొన్నారు. ( cm kcr write a letter to pm ) రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో గరిష్ట విద్యుత్ డిమాండ్ జూన్ 2014లో 5,661 మెగావాట్లు ఉండగా, 2021 మార్చి నాటికి 13,688 మెగావాట్లకు పెరిగినందున విద్యుత్ ఉత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయడం చాలా కీలకమని తెలిపారు.
Gang rape : డిప్రెషన్‌లో ఉన్న మైనర్ స్టూడెంట్... నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తిప్పి... !
సింగరేణిలో బొగ్గు అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అనేక మైనింగ్ లీజులను మంజూరు చేసిందని, దానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. ( cm kcr write a letter to pm )కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ట్రాంచ్ 13 కింద వేలం వేయదలిచిన జేబిఆర్ఓసి-3, శ్రావన్ పల్లి ఓసి, కోయగూడెం ఓసి-3 మరియు కెకె -6 యుజి బ్లాక్ ల వేలం వల్ల సింగరేణి పరిధిలోని బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నదని అందువల్ల వాటి వేలాన్ని నిలిపివేయమని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను ఆదేశించవలసిందిగా ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రధానిని కోరారు. ఈ బ్లాక్ లను సింగరేణికే కేటాయించేలా చూడాలని సిఎం ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
Hyderabad : వాటర్ ట్యాంక్‌లో 15 రోజులుగా శవం.. ఇంట్లో గొడవ పడి వెళ్లిన నగర వాసిగా గుర్తింపు..
సింగరేణి బొగ్గు గనుల్లోని బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘం సమ్మె సైరన్ మోగించింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS) సమ్మె నోటీసిచ్చింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని.. ఆ నాలుగు బ్లాకులను సింగరేణికి ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. ( Singareni workers strike against privatisation)
కాగా ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 9 నుంచి సమ్మె చేపట్టాలని అధికార సంఘం టీబీజీకేఎస్ నిర్ణయం తీసుకుంది. కోల్ ఇండియాలోని 89 బ్లాకులతో పాటు సింగరేణి (Singareni workers strike against privatisation) లోని నాలుగు బ్లాకుల ప్రైవేటీకరణపై కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కాగా ప్రైవేటీకరణతో కార్మికులకు రావాల్సిన వారసత్వ ఉద్యోగాల్లో కోత, లాభాల్లో వాటాలు కూడా కనుమరుగవుతాయని యూనియన్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.