హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR: నేడు యాదగిరిగుట్టకు సీఎం కేసీఆర్.. స్వామి వారికి కిలో 16 తులాల బంగారం సమర్పణ

CM KCR: నేడు యాదగిరిగుట్టకు సీఎం కేసీఆర్.. స్వామి వారికి కిలో 16 తులాల బంగారం సమర్పణ

తెలంగాణ సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్

CM KCR Yadagiri Gutta Tour: యాదాద్రి పర్యటనకు సతీసమేతంగా వెళ్తున్న సీఎం కేసీఆర్.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం బంగారాన్ని విరాళంగా సమర్పిస్తారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ ఇవాళ యాదగిరిగుట్ట (CM KCR Yadadri Tour) పర్యటించనున్నారు. యాదగిరిగుట్టపై శ్రీలక్షీనరసింహస్వామి (Sri Lakshmi Narasimha Swamy Temple) వారిని ఆయన దర్శించుకోనున్నారు. యాదాద్రి పర్యటనకు సతీసమేతంగా వెళ్తున్న సీఎం కేసీఆర్.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం బంగారాన్ని విరాళంగా సమర్పిస్తారు. సీఎం కేసీఆర్ పర్యటన కోసం అధికారులు అప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. హైదరాబాద్ (Hyderabad) నుంచి రోడ్డుమార్గంలోనే ఆయన యాదాద్రికి వెళ్తారు. ఉదయం 10.30 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి బయలుదేరి 11.30 గంటలకు యాదాద్రికి చేరుకుంటారు. లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ గతంలో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎంతో మంది నేతలు, భక్తులు బంగారాన్ని విరాళంగా ఇచ్చారు.

  • KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. కొత్త పార్టీకి సొంత విమానం.. రూ.80 కోట్ల విరాళాల సేకరణ

  తాను కూడా కిలో 16 తులాల బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించిన సీఎం... ఇప్పుడు ఆ బంగారాన్ని స్వామి వారికి సమర్పించనున్నారు. స్వామి వారి దర్శనం, బంగారం సమర్పణ కార్యక్రమాల తర్వాత గుట్టపై వివిధ పనుల పురోగతిని సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. బాలాలయం ఆవరణలోని కళావేదికకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 3 గంటలకు యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు సీఎం కేసీఆర్. దసరాకు జాతీయ పార్టీ ప్రకటించనున్న సీఎం కేసీఆర్.. అంతకంటే ముందు యాదాద్రిలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త పార్టీ ప్రకటనకు ముందు సిద్దిపేట సమీపంలోని కోనాయపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నట్లు తెలుస్తోంది.

  దసరా సెలవులకు వెళ్తున్న వారికి శుభవార్త.. 12 స్పెషల్ ట్రైన్లు ప్రకటన.. తేదీలు, టైమింగ్స్

  శనివారం సీఎం కేసీఆర్ హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ పర్యటనకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ నుంచి రోడ్డుమార్గంలో సీఎం కేసీఆర్ బయలుదేరుతారు. ఉదయం 11.15 నిమిషాలకు హనుమకొండ చేరుకుంటారు. అక్కడ ములుగు రోడ్డులో ప్రతిమా రిలీఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్‌ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్న భోజనం తర్వాత తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రగతిభవన్ చేరుకుంటారు.

  మరోవైపు అక్టోబరు 5న దసరా పండగ సందర్భంగా సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేయబోతున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడమే లక్ష్యంగా కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. అక్టోబర్ 5వ తేదీన తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జాతీయ పార్టీపై కార్యవర్గం తీర్మానం చేయనుంది. జాతీయ పార్టీ విషయంలో కేసీఆర్ మొత్తం నాలుగు పేర్లను పరిశీలిస్తున్నారు వీటిలో భారతీయ రాష్ట్ర సమితి (BRS) లేదా భారతీయ రైతు సమితి పేరుకే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Telangana, Yadadri, Yadadri temple, Yadagirigutta

  ఉత్తమ కథలు