తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక (Munugodu By poll) బైపోల్ హీట్ పెంచుతుంది. ప్రతిపక్షాలపై విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్ నాయకులు సవాల్, ప్రతిసవాళ్లతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. మునుగోడులో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ (Etela Rajendar) మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో సీఎం కేసీఆర్ పై (Cm Kcr) ఈటెల రాజేందర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
CM KCR: కవితతో కలిసి ఢిల్లీలోనే సీఎం కేసీఆర్ .. మరో రెండు రోజుల పాటు అక్కడే..!
ప్రజలను చంపి సంపాదిస్తున్న ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అంటూ ఈటెల రాజేందర్ (Etela Rajendar) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా టీఆర్.ఎస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. మోడీ (Modi) గీడీ ఏం పీకలేరు అని మాట్లాడుతున్నారు. స్థాయిని బట్టి మాట్లాడాలి, పిచ్చి వేషాలు వేస్తే బాగుండదని హెచ్చరించారు. ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఈటెల రాజేందర్ (Etela Rajendar) కౌంటర్ ఇచ్చారు.
ఇక నా భార్య జమున ప్రచారానికి వస్తే ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. ఆమె ఇక్కడికి వచ్చి ఏం చేస్తుందని అంటున్నారు. ఎవరెవరో వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. అలాంటిది జమున పుట్టిన గడ్డ ఇది. ఈ మట్టి బిడ్డ. ఆమె సొంత ఊరికి రావొద్దట. మా జోలికి వస్తే మాడి మసి అవుతారు. అనవసర మాటలు మాట్లాడొద్దు అంటూ టీఆర్ఎస్ (TRS) నాయకులను హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి రాగానే బానిస అధికారుల భరతం పడతామని హెచ్చరించారు. మునుగోడులో ఎవరి జోలికి పోకుండా తాము ప్రచారం చేసుకుంటున్నామని, తమ జోలికి ఎవరూ రావొద్దని సూచించారు. మీరు డబ్బును, మద్యాన్ని నమ్ముకున్నారు అంటూ టిఆర్ఎస్ నాయకులకు చురకలు అంటించారు. తమ వెంట న్యాయం, ధర్మం ఉన్నాయని, హుజురాబాద్ లో జరిగిందే మునుగోడులో జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రతి వంద మందికి ఒక బెల్ట్ షాప్ పెట్టి తాగిపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ చేసే వాళ్లకు రైతుబంధు ఇవ్వొచ్చు కానీ కౌలు రైతులకు ఇవ్వడానికి మాత్రం మనసు రావట్లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రజలను పీడిస్తూ, చంపుతూ సంపాదిస్తున్నాడని ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ శాశ్వత పరిపాలకుడేం కాదు. 2023 వరకే కేసీఆర్ ఉంటారు. ఆయన కింద బానిస అధికారులు ఉంటారన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ వల్లే మీ ముందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తున్నారు. డబ్బులు కూడా వస్తున్నాయన్నారు. కాబట్టి రాజగోపాల్ రెడ్డిని మరిచిపోవద్దని మునుగోడు ప్రజానీకాన్ని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Munugodu By Election, Telangana