Home /News /telangana /

CM KCR WARNS TO CENTRAL GOVT TO PURCHASE PADDY IN TELANGANA VRY

CM KCR : సమయం లేదు.. ధాన్యం కొంటారా.. ? లేదా.. బియ్యంతో బీజేపీ కార్యాలయాన్ని ముంచుతాం.

ధర్నాలో మాట్లాడుతున్న సీఎం

ధర్నాలో మాట్లాడుతున్న సీఎం

CM KCR : ఇందిరాపార్క్ మహాధర్నలో పాల్గోన్న సీఎం కేసిఆర్ ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. వెంటనే ఎఫ్‌సిఐ అనుమతులు ఇవ్వాలని లేదంటే మొత్తం ధాన్యాంతో బీజేపీ కార్యాలయాన్ని ముంచుతామని హెచ్చరించారు. మహాధర్నా తర్వాత ర్యాలీగా రాజ్‌భవన్‌గా వెళ్లి గవర్నర్‌కు వినతి పత్రం అందించారు.

ఇంకా చదవండి ...
    ధాన్యం కొనుగులుపై సీఎం కేసిఆర్ మరోసారి కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. ధాన్యం కొంటారా లేదా అని ఆయన నిలదీశారు. దీంతోపాటు కేంద్రం వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. కేంద్రం అవలంభిస్తున్న విధానాలపై తిరుగుబాటు చేయాల్సిన అవశ్యకత ఏర్పడిందని అన్నారు. రైతులు సంవత్సర కాలంగా ఆందోళన చేస్తున్న పట్టించుకోవడం లేదని ఆయన మండి పడ్డారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి, భయానికి గురి చేస్తున్నారని, అయితే సీఎం కేసిఆర్ కేసులకు భయపెడతారా అని అన్నారు. పీఎం మోదీని దండం పెట్టి అడుగుతున్నానని , రైతులను ఆదుకుంటారా..? లేదా స్పష్టం చేయాలని కోరారు.. కేంద్రం నిర్ణయంపై మరో రెండు రోజులు వేచి చూస్తానని అన్నారు.. వానకాలం పంటను కొంటారా లేదా... మరోవైపు యాసంగిలో వరిధాన్యం వేయాలా వద్దా అని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్రం నుండి స్పష్టత రాకపోతే.. గ్రామాల్లో చావు డప్పు మోగిస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ యుద్దం ప్రారంభిస్తే... విజయం సాధించేవరకు విశ్రమించదని ఆయన హెచ్చరించారు.

    బీజేపీ నోరు విప్పితే అబద్దాలు.

    బీజేపీ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు సోషల్ మీడియాలో ప్రచారాలు చేయడంతో పాటు వ్యక్తిగతంగా దాడులు చేస్తోందని ఆయన విమర్శించారు. ఇక కేంద్రం, రాష్ట్రానికి ప్రతి అంశలో మొండి చేయి చూపిస్తోందని అన్నారు. రాష్ట్రాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందని అయినా తాము ఓపిక పట్టామని అన్నారు.. అయినా ఎన్నాళ్లు ఓపిక పట్టాలని ప్రశ్నించారు. నిన్నటి వరకు దండం పెట్టి అడిగామని..తాము వినతి చేసి.. 50 రోజులు గడుస్తున్నా ఎలాంటీ సమాధానం రాలేదని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో వరి ధాన్యం వద్దని మంత్రి చెప్పారని, అయితే బీజేపీ మాత్రం ధాన్యమే వేయాలని రైతులకు చెబుతున్నారని అన్నారు. ఓ వైపు ధాన్యం కొనుగోలు చేయకుండా మరోవైపు ఇక్కడ వరి వేయాలని ప్రచారం చేసి రాజకీయం చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ దమ్ముంటే నేరుగా వరిధాన్యం కొంటామని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.



    బియ్యం  బీజేపీ ఆఫీసు ముందు పోస్తం

    తక్షణమే.. ఎఫ్‌సిఐ ధాన్యం కొనుగోలుపై అనుమతి ఇస్తూ లేఖ ఇవ్వాలని లేదంటే తెలంగాణలో ఉన్న మిగులు బియ్యాన్ని మొత్తం తీసుకువచ్చి బీజేపీ కార్యాలయం ముందు పోసి ఆ పార్టీ కార్యాలయాన్ని ముంచుతామని హెచ్చరించారు .

    ఆకలి రాజ్యాల్లో భారత్‌ది 101 స్థానం

    ఆకలితో అలమటించే దేశాల్లో భారత్ 101 స్థానంలో ఉందని అన్నారు. మొత్తం 106 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో భారత్ ఈ స్థానం నిలవడం వెనక దేశ నేతల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఇక భారత దేశం ఆకలి విషయంలో నేపాల్ ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే వెనకబడి ఉందని అన్నారు. ఈ సమస్యను అధిగమించే లక్ష కోట్లు ఖర్చు పెట్టి సేకరించి ధాన్యం నిల్వలు పెట్టాల్సిన భాద్యత ఉందని అన్నారు. అయితే ఇంతా చెప్పినా.. కనీసం పరిష్కారం చూసే ఆసక్తి కేంద్రానికి లేదని అన్నారు..
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CM KCR, Indirapark

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు