హోమ్ /వార్తలు /తెలంగాణ /

Cm Kcr: బండి సంజయ్, రేవంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ వార్నింగ్..కూలుస్తుంటే చూస్తూ ఊరుకుంటామా..

Cm Kcr: బండి సంజయ్, రేవంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ వార్నింగ్..కూలుస్తుంటే చూస్తూ ఊరుకుంటామా..

కేసీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి

కేసీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాటల తూటాలు పేల్చారు. తనకు దొరికిన సమయాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ..ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఇటీవల నూతన సచివాలయంపై బండి సంజయ్, ప్రగతిభవన్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. కూల్చేస్తుంటే ఊరుకుంటామా. ప్రజలు ఊరుకుంటారా. కాళ్లు చేతులు విరగ్గొట్టి కూచోబెడతారని వార్నింగ్ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో సీఎం కేసీఆర్ (Cm Kcr) మాటల తూటాలు పేల్చారు. తనకు దొరికిన సమయాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ..ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఇటీవల నూతన సచివాలయంపై బండి సంజయ్, ప్రగతిభవన్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. కూల్చేస్తుంటే ఊరుకుంటామా. ప్రజలు ఊరుకుంటారా. కాళ్లు చేతులు విరగ్గొట్టి కూచోబెడతారని వార్నింగ్ ఇచ్చారు.

Cm Kcr: 12 సార్లు ఈటెల పేరును ప్రస్తావించిన కేసీఆర్ ..పొంగిపోను..పిలిచినా పోనన్న రాజేందర్

బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత 20 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదిలేశారని ఆరోపించారు. దేశంలో ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన రూ.473 కోట్లు కూడా ఏపీకి ఇచ్చి అన్యాయం చేశారని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వాలని ఏడేళ్లుగా అడుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు తెస్తే తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలని కేసీఆర్ ప్రశ్నించారు.

Cm Kcr: సీఎం పదవికి రాజీనామా చేస్తానన్న సీఎం కేసీఆర్..ఎందుకంటే?

 మొదట కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన కేసీఆర్ ఆ తరువాత బండి సంజయ్ , రేవంత్ రెడ్డి టార్గెట్ గా సీఎం కేసీఆర్ (Cm Kcr) తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక ఆ తరువాత రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై మాట్లాడుతున్న సమయంలో కేసీఆర్ అసెంబ్లిలో మొదటిసారి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేరును ప్రస్తావించారు. ఇక ఆతరువాత కేసీఆర్ తన ప్రసంగంలో ఈటెల పేరును పదే పదే చెప్పుకొచ్చారు. మొత్తం తన ప్రసంగంలో 12 సార్లు ఈటెల పేరును కేసీఆర్ (Cm Kcr) ప్రస్తావించడం గమనార్హం.

అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా..

ఇక కేసీఆర్ ప్రసంగం అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపగా అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు. మొత్తం 7 రోజుల పాటు 56 గంటల 25 నిమిషాలు సమావేశాలు జరిగాయి. ఈనెల 6న తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

First published:

Tags: Bandi sanjay, CM KCR, Mp revanthreddy, Telangana

ఉత్తమ కథలు