హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR : యాదాద్రికి చేరుకున్న సీఎం కేసిఆర్, ఏరియల్ వ్యూ.. అధికారులతో సమీక్ష

CM KCR : యాదాద్రికి చేరుకున్న సీఎం కేసిఆర్, ఏరియల్ వ్యూ.. అధికారులతో సమీక్ష

యాదాద్రిలో సీఎం కేసీఆర్

యాదాద్రిలో సీఎం కేసీఆర్

CM KCR : సిఎం కేసీఆర్ యాదాద్రి చేరుకున్నారు. ఆయనకు పూజారులు స్వాగతం పలికిన అనంతరం అక్కడ జరుగుతున్న అభివృద్ది పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.

సీఎం కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. మార్చి 28న ఆలయ పునప్రారంభం కానుండడంతో అందుకు

సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష సమావేశంలో సీఎం పాల్గొని అందుకు సంభంధించిన కార్యక్రమాలపై

చర్చించనున్నారు. కాగా యాదాద్రికి చేరుకున్న సీఎం ఏరియల్ వ్యూ ద్వారా ఆలయనిర్మాణాన్ని పరీశీలించారు. యాగం జరిగే స్థలంతో పాటు ఇతర అంశాలను పరిశీలించారు. ఆలయానికి చేరుకున్న అనంతరం చుట్టూ తిరుగుతూ పలు సూచనలు చేశారు.

కాగా మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణంతో పాటు సుదర్శన యాగం చేయనుండడంతో అందుకు

సంబంధించిన అంశాలపై ఆలయ పండితులు ఇతర అధికారులతో నేడు సాయంత్రం సమీక్ష

నిర్వహించనున్నారు. కాగా ముఖ్యమంత్రి వెంట ఎమ్మెల్యే గొంగిడి సునిత, మోత్కుపల్లి నర్సింహులు ఇతర స్థానిక నేతలు ఉన్నారు.

First published:

Tags: CM KCR, Yadadri temple

ఉత్తమ కథలు