పవన్ కళ్యాణ్ స్నేహితుడితో కేసీఆర్ కీలక చర్చలు..

పవన్ కళ్యాణ్ స్నేహితుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పనులకు నేతృత్వం వహిస్తున్నారు.

news18-telugu
Updated: August 17, 2019, 6:03 PM IST
పవన్ కళ్యాణ్ స్నేహితుడితో కేసీఆర్ కీలక చర్చలు..
యాదాద్రి పనులపై ఆనంద్ సాయితో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్నేహితుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక చర్చలు జరిపారు. ఈరోజు కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. యాదాద్రి పునర్నిర్మాణ పనుల గురించి ఆనంద్ సాయిని, ఇతర ఆలయ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆనంద్ సాయిని పిలిచి మరీ కేసీఆర్ ఆయనకు అద్భుత అవకాశాన్ని ఇచ్చారు. యాదాద్రిని పునర్నిర్మించి, దానికి పునర్వైభవాన్ని తీసుకొచ్చేలా కళాత్మకత ఉట్టిపడేలా చూడాలని ఆదేశించారు. దీంతో ఆయన గత నాలుగేళ్ల నుంచి అదే తపోఃనిష్టతో ఆ కార్యక్రమంలో మునిగిపోయారు. అత్యంత నియమనిష్టలతో యాదాద్రి పునర్నిర్మాణ, శిల్పకళాకృతుల రూపకల్పనలో మునిగిపోయారు. ఓ రకంగా నాలుగేళ్లుగా ఆనంద్ సాయి ఆలయానికి అంకితం అయిపోయారు. ఎలాంటి సినిమాలు కూడా ఒప్పుకోకుండా ఆయన ఆలయ పనులను త్రికరణ శుద్దితో నిర్వహిస్తున్నారు.

యాదాద్రిలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన, పక్కన ఆనంద్ సాయి (గడ్డంతో ఉన్న వ్యక్తి)


యాదాద్రి ఆలయానికి సంబంధించిన పనులను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, త్రిదండి శ్రీచినజీయర్ స్వామితోనూ చర్చిస్తున్నారు. వారి సూచనలు, సలహాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేస్తూ ఆగమోక్తంగా యాదాద్రి పునర్నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో యాదాద్రిలో పర్యటించిన కేసీఆర్ ఆనంద్ సాయితో కలసి యాదాద్రిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. పనుల పురోగతి గురించి తెలుసుకున్నారు. యాదాద్రి కోసం ఆనంద్ సాయి చూపుతున్న శ్రద్ధను పలుమార్లు కేసీఆర్ ప్రశంసించారు.

First published: August 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు