హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR : వరంగల్ ఎంజీఎం ను సందర్శించనున్న సీఎం కేసీఆర్

CM KCR : వరంగల్ ఎంజీఎం ను సందర్శించనున్న సీఎం కేసీఆర్

వరంగల్ ఎంజీఎం ను సందర్శించనున్న సీఎం కేసీఆర్

వరంగల్ ఎంజీఎం ను సందర్శించనున్న సీఎం కేసీఆర్

warangal సీఎం కేసిఆర్ వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎమ్‌జీఎమ్ ఆసుపత్రిని సందర్శించనున్నట్టు తెలుస్తోంది. కొవిడ్ రోగుల భరోసాతోపాటు ఆసుపత్రుల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించారు..ఈ నేపథ్యంలోనే శుక్రవారం వరంగల్‌లోని ఎమ్‌జీఎమ్ ఆసుపత్రిని సందర్శించనున్నాట్టు సమాచారం.

ఇంకా చదవండి ...

సీఎం కేసిఆర్ వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎమ్‌జీఎమ్ ఆసుపత్రిని సందర్శించనున్నట్టు తెలుస్తోంది. కొవిడ్ రోగుల భరోసాతోపాటు ఆసుపత్రుల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించారు..ఈ నేపథ్యంలోనే శుక్రవారం వరంగల్‌లోని ఎమ్‌జీఎమ్ ఆసుపత్రిని సందర్శించనున్నాట్టు సమాచారం.

తెలంగాణ సీఎం కేసిఆర్ కరోనా కట్టడికి నేరుగా రంగంలోకి దిగారా..ఇంత పెద్ద కొవిడ్ సంక్షోభంలో కూడ సీఎం కేసిఆర్ మంత్రి ఈటలను బర్తరఫ్ చేసి ..రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలను సీఎం ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షాల విమర్శలతో పాటు రాష్ట్రంలో కోవిడ్ రోగులు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు..దీంతో సీఎం కేసిఆర్ నేరుగా కోవిడ్ కట్టడికి రంగంలోకి దిగారు..ఆసుపత్రుల పనితీరు కొవిడ్ భాదితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయనే స్వయంగా తెలుసుకునేందుకు సమాయాత్తవుతున్నారు.

మంత్రి ఈటల భర్తరఫ్ తర్వాత  కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. మంత్రి కేటిఆర్ చైర్మన్ గా వైద్య, మరియు పోలీసు విభాగాలతో కమిటిని నియమించారు. ఇందులో భాగంగానే   సీఎం కేసిఆర్ సైతం బుధవారం హైదరాబాద్ గాంధీ హస్పిటల్‌ను సందర్శించారు. గాంధీలోని ఐసియులో చికిత్స పొందుతున్న వారికి భరోసా కల్గిస్తూ పలువురు కోవిడ్ పేషంట్లను స్వయంగా  పరామర్శించారు.

ఈ నేపథ్యంలోనే ఆయన పలు జిల్లా ఆసుపత్రులను కూడ సందర్శించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.   వరంగల్‌లోని కొవిడ్ ఆసుపత్రిగా ప్రకటించిన ఎమ్‌జీఎమ్‌ను సందర్శించనున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన సూపర్ స్పేషాలిటి ఆసుపత్రిని కూడ సందర్శించనున్నారు. కాగా ఇదివరకే సీఎం కేసిఆర్ ఆసుపత్రుల్లో మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించగా వరంగల్ సూపర్ స్పేషాలిటితో పాటు ఆదిలాబాద్‌లోని ఆసుపత్రులను కూడ ప్రారంభించాలని నిర్ణయించారు.

First published:

Tags: CM KCR, Corona, Warangal

ఉత్తమ కథలు