హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR : ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసేందుకు అనువైన వాతావరణం ఉండాలి..! నూతన సచివాలయంలో సీఎం

CM KCR : ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసేందుకు అనువైన వాతావరణం ఉండాలి..! నూతన సచివాలయంలో సీఎం

cm visit

cm visit

CM KCR : నూత‌న స‌చివాల‌య నిర్మాణ ప‌నుల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేడు మరోసారి ప‌రిశీలించారు. స‌చివాల‌య నిర్మాణ ప‌నుల గురించి ఆర్ అండ్ బీ అధికారులు, ఇంజినీర్లు సీఎం కేసీఆర్‌కు వివ‌రించారు. ప‌నుల పురోగ‌తిని అధికారుల‌ను అడిగి సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు.

ఇంకా చదవండి ...

నూతన సచివాలయ నిర్మాణ పనులను పూర్తిచేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో వున్న సచివాలయ పనుల తీరుతెన్నులను గురువారం సిఎం కేసీఆర్ పరిశీలించారు. ( cm kcr visits newly constructing secretariat ) వేగవంతంగా జరుగుతున్న పనుల పురోగతిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేస్తున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను సిఎం అభినందించారు.

కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసుకుంటూ తుది మెరుగులకు సిద్ధమవుతున్న సచివాలయ భవన నిర్మాణ పనులను సిఎం కెసిఆర్ క్షుణ్ణంగా పరిశీలించారు. మంత్రితో సహా ఆర్ అండ్ బీ శాఖ అధికారులను వర్క్ ఏజెన్సీ ఇంజనీర్లతో పనుల గురించి చర్చించారు. ( cm kcr visits newly constructing secretariat ) నిర్మాణంలో ఉన్న మినిస్టర్ చాంబర్లు, పార్కింగ్ ఏరియాలు, సెక్రటరీలు, వీఐపీల చాంబర్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తూ, అధికారులకు తగు సూచనలిచ్చారు. కారిడార్లు సహా గ్రౌండు ఫ్లోరు, మొదటి ఫ్లోరుతో సహా నిర్మాణంలో వున్న సచివాలయ ప్రాంగణమంతా కలియతిరిగారు.

MLC Eelctions : రేపే ఎమ్మెల్సీ ఎన్నికలు... పోలింగ్ స్టేషన్లకు చేరుకున్న సిబ్బంది...


ఈ సంధర్భంగా తుది దశ నిర్మాణంలో చేపట్టవలసిన ఎలివేషన్ తదితర ఫైనల్ వర్కుల కోసం తగు సూచనలు చేశారు. సచివాలయం బాహ్య అలంకరణలో భాగంగా గోడలకు వేసే గ్లాడింగ్ టైల్స్, గ్రానైట్స్, తదితర మోడల్లను అధికారులు ప్రదర్శనకు పెట్టారు. వాటిని నాణ్యతను కలర్ డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి ఎలివేషన్ ప్రకాశవంతంగా, సుందరంగా కనిపించేలా ఉండాలని సూచించారు. ( cm kcr visits newly constructing secretariat ) వాల్ గ్లాడింగ్ టైల్స్, గ్రానైట్స్, యూపీవీసీ విండోస్, అల్యూమినియం ఫాబ్రికేషన్స్, మెట్లకు వేసే గ్రానైట్స్, ఫ్లోరైడ్ మార్బుల్స్, గ్రానైట్స్ పలు రకాల మోడళ్లను అధికారులు సీఎం కేసీఆర్ ఎదుట ప్రదర్శించారు.


Hyderabad : ఆదిలాబాద్ కలెక్టర్ పై గోనే ప్రకాశ్ రావు వివాదస్పద వ్యాఖ్యలు... కేసిఆర్ బాషలో ఆమె...


దీంతో తన వెంట వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురి అభిప్రాయాలను తెలుసుకుని వాటిలో కొన్ని మోడళ్లను ముఖ్యమంత్రి ఫైనల్ చేశారు. ( cm kcr visits newly constructing secretariat ) నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసేందుకు అనువైన వాతావరణం కల్పించేలా నిర్మించిన కార్యాలయాలు, విశాలమైన కారిడార్లను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. . దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న సచివాలయ నిర్మాణాలను పరిశీలించాలని, అందులో మంచి అంశాలను స్వీకరించాలని సూచించారు.

Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

First published:

Tags: CM KCR, Hyderabad

ఉత్తమ కథలు