Home /News /telangana /

CM KCR VISITS KONDAGATTU TEMPLE SOON VRY KNR

CM KCR : యాదాద్రి తరహాలో.. అంజనాద్రి.. వేములవాడ, కొండగట్టుకు సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ ఫైల్ ఫోటో

సీఎం కేసీఆర్ ఫైల్ ఫోటో

CM KCR : యాదాద్రి తర్వాత వేముల రాజన్న ఆలయంతో పాటు కొండగట్టు అంజనేయ స్వామి అభివృద్దిపై సీఎం ఫోకస్ పెట్టారా.. వైష్ణవ ఆలయాల నుండి తెలంగాణలో అధికంగా ఉండే శివాలయాల వైపు సీఎం దృష్టి సారించారా...?

    యాదగిరి గుట్టలోని నర్సింహాస్వామి ఆలయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా పున:నిర్మించి ప్రారంభించిన సీఎం కేసీఆర్ దృష్టి ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయం, అదే జిల్లాల్లోని కొండగట్టు ఆలయాన్ని కూడా అభివృద్ది పథంవైపు నడిపించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రెండు ఆలయాలకు సంబంధించి ఇప్పటికే అధికారలు ప్రణాళికలు సిద్దం చేశారు. అయితే రాజన్న ఆలయం వైపు అడుగులు పడుతుండగా తాజా కొండగట్టు అంజనేయ స్వామి ఆలయాన్ని కూడా అదే సమయంలో అభివృద్ది చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.. ఈ క్రమంలోనే కొండగట్టు ఆలయం అభివృద్దికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశారు.

    ఈ క్రమంలోనే కొండగట్టుకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్ , ఇతర అధికారులతో కలిసి కొండగట్టు ప్రాంతాన్ని పరిశీలించారు. ఆలయ ఆభివృద్దికి తీసుకోవాల్సి ఏర్పాట్లపై చర్చించారు. దీంతో సీఎం వచ్చిన తర్వాత వాటిపై అధికారులతో చర్చించనున్నట్టు సమాచారం. అయితే ఆలయం అభివృద్దిపై సీఎం దృష్టిపెడతారని స్థానిక ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆయన ఒక్కసారి దర్శనం చేసుకున్న తర్వాత అభివృద్దికి బాటలు పడుతాయని నమ్ముతున్నారు. యాదాద్రి తరహాలోనే అంజనాద్రీగా అభివృద్ది చేస్తారనే విశ్వాసంతో భక్తులు సైతం ఉన్నారు. దీంతో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న మాస్టర్ ప్లాన్ కు ఆమోదం తెలుపుతారానే విశ్వాసాన్ని వెలిబుచ్చుతున్నారు.

    సీఎం కేసీఆర్ కొండగట్టు ఆంజ నేయ స్వామిని దర్శించుకున్న అనంత రం యాదాద్రి తరహాలో కొండగట్టుకు సైతం నిధులు ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు . యాదగిరి యాదాద్రిగా తీర్చిదిద్దినట్టే కొండగట్టును సైతం అంజనాద్రిగా మార్చేందుకు నిర్ణయాన్ని ప్రకటిస్తారని భక్తులు , స్థానికులు కొండంత విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు .

    CM KCR : కాసేపట్లో.. సీఎం కేసీఆర్ ఢిల్లీకి.. బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో...కారణం ఇదే...

    1500 సంవత్సరాల క్రితం కొండగట్టు గుట్టల్లో కోరంద పొదల్లో స్వయంభువు గా వెలిసిన ఆంజనేయ స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా కొలువులీనుతున్నాడు . రెండు జయంతులు జరుపుకునే ఏకైక దేవస్థానంగా కొండ గట్టు ప్రసిద్ధికెక్కింది . ఏక ముఖం లేదా పంచ ముఖాలతో దర్శనమిచ్చే ఆంజనే య స్వామి కొండగట్టులో మాత్రం దేశం లో ఎక్కడా లేని విధంగా ద్విముఖాలతో భక్తులకు దర్శనమిస్తాడు. నారసింహుడు , ఆంజనేయుని రూపాలతో కొండగ ట్టులో స్వామి వారు కొలువై ఉన్నారు
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CM KCR, Karimnagar, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు