CM kcr : గాంధీ ఐసియూలో సీఎం కేసిఆర్ .. కరోనా రోగుల పరామర్శ

గాంధీ ఐసియూలో సీఎం కేసిఆర్ .. కరోనా రోగుల పరామర్శ

CM KCR : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఆయన కాసేపటి క్రితమే ఆసుపత్రికి చేరుకున్నారు. కొవిడ్‌ బాధితులకు అందుతున్న వైద్య సేవలను ఆయన స్వయంగా పరిశీలించారు.

  • Share this:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఆయన కాసేపటి క్రితమే  ఆసుపత్రికి చేరుకున్నారు.  కొవిడ్‌ బాధితులకు అందుతున్న వైద్య సేవలను ఆయన స్వయంగా పరిశీలించారు. హాస్పటల్లో కొవిడ్‌ చికిత్స పొందుతున్న బాధితులకు సంబంధించి ఆయన స్వయంగా విషయాలను తెలుసుకున్నారు. అనంతరం అక్కడి సదుపాయాలపై అధికారులతో సమీక్షించినట్టు  తెలుస్తోంది. ఇక సీఎం కేసిర్ వెంట మంత్రి హరీష్ రావుతో పాటు సీఎస్ సోమేష్ కుమార్ ఇతర వైద్య అధికారులు ఉన్నారు.

ఇక గాంధి ఆసుపత్రులోని లైబ్రరీని కూడ 300 బెడ్స్ గా కోవిడ్ సెంటర్‌గా మార్చనున్నట్టు తెలుస్తోంది. దీన్ని సీఎం పరీశీంచారు. ఐసీయూ వార్డులోకి సీఎం కేసిఆర్ వెళ్లి  నేరుగా కొవిడ్ రోగులను పరామర్శించారు. మరోవైపు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సంధర్బంగా గాంధీలో సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు. ఔట్‌ పేషంట్లకు అందుతున్న వేద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

అయితే  సీఎం  కేసీఆర్ మొదటి సారి గాంధీ ఆసుపత్రిని సందర్శించనుండటం గమనార్హం.  ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ఇటివల ఆరోగ్యశాఖ మంత్రి ఈటలను తొలగించిన అనంతరం సీఎం స్వయంగా వైద్యానికి సంబంధించిన అంశాలను ఆయన సమీక్ష చేస్తున్నారు. కాగా కరోనా పేషంట్ల విషయంలో సీఎం కేసిఆర్ వ్యవహర శైలిపై ప్రతిపక్ష పార్టీలు అనేక విమర్శలు చేస్తున్నారు. కనీసం ఆయన బయటకు రాకుండా ఉంటున్న తీరును తప్పుబట్టాయి.
Published by:yveerash yveerash
First published: