మేడారంలో కేసీఆర్.. సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న సీఎం

సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకొని వన దేవతలను దర్శించుకున్నారు. తల్లీకూతుళ్లకు పట్టవస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు.


Updated: February 7, 2020, 4:23 PM IST
మేడారంలో కేసీఆర్.. సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న సీఎం
మేడారం జాతరలో సీఎం కేసీఆర్
  • Share this:
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కన్నుల పండవలా సాగుతోంది. గద్దెలపై కొలువైన వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. జాతర మూడో రోజు అమ్మవార్ల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకొని వన దేవతలను దర్శించుకున్నారు. తల్లీకూతుళ్లకు పట్టవస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు. సీఎం వెంట మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ ఉన్నారు.

సీఎం కసీఆర్ రాకతో తాడ్వాయి అటవీ ప్రాంతంలో పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌కు ముందు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అమ్మవార్లను దర్శించుకొన్నారు. ఇద్దరూ అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని కానుకగా సమర్పించారు. కాగా, ప్రస్తుతం గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మ రేపు తిరిగి వన ప్రవేశం చేశారు. దాంతో ఈ ఏడాది మేడారం జాతర ముగుస్తుంది.
First published: February 7, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు