cm kcr :ముందున్న సవాల్‌ను ఎదుర్కొనేందుకే సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్ పర్యటనా..?

తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫొటో)

cm kcr : హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఆగస్టు 2న సాగర్ నియోజకవర్గాన్ని పర్యటిస్తారంటూ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రకటించారు..దీంతో ఉప ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సమీక్షించేందుకు ఆయనే స్వయంగా రానున్నట్టు సమాచారం.

  • Share this:
    హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఎలాంటి విమర్శలు రాకుండా సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్త పడుతున్నారా...ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పటికే సీఎం కేసీఆర్ పై అనేక విమర్శలు తలెత్తాయి..ఎన్నికల కోసం ఆయన ఎలాంటీ వాగ్దానాలైన చేస్తారని ఆ తర్వాత వాటిని పక్కన పెడతారని ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. దీంతో హుజూరాబాద్‌లో ఇచ్చే హామీలు కూడా ఇదేవిధంగా ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం దళిత బంధు పథకం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.

    దీంతో సీఎం కేసీఆర్ అలర్ట్ అయినట్టు కనిపిస్తోంది.తాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలిపించిన నాగార్జున సాగర్ నియోజకవర్గంపై దృష్టి సారించారు..ఆయన ఇచ్చిన హామీలపై ప్రగతిభవన్ నుండే సమీక్షించే అవకాశాలు ఉన్నా.. సీఎం నేరుగా నియోజకవర్గానికే పయనం అయ్యారు. దీంతో గతంలో కాకుండా తాను ఇచ్చిన హామీలపై నియోజకవర్గంలోనే సమీక్షించనున్నట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నారు. మొత్తం నియోజకవర్గం పర్యటించిన జరుగుతున్న అభివృద్ది పనులపై ఆరా తీయనున్నట్టు తెలుస్తోంది.. అందుకే ఆయన సాగర్‌ టూర్ కు రెఢి అయినట్టు చెబుతున్నారు. సాగర్ టూర్‌తో తాను ఇచ్చిన హామీలపై చిత్తశుద్దితో పనిచేస్తాననే సంకేతాలను హుజూరాబాద్ ఓటర్లకు ఇచ్చే అవకాశాలు ఉంటాయనేది విశ్లేషకుల అభిప్రాయం. అందుకే ఆయన ముందు జాగ్రత్త చర్యగా నియోజకవర్గంలో పర్యటించున్నట్టు భావిస్తున్నారు. కాగా ఎన్నికల సభలో తన హామీలు నెరవేర్చకపోతే తల నరుక్కుంటానని సీఎం హాలియా సభలో హామి ఇచ్చారు.

    కాగా నాగార్జున సాగర్ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 10న సీఎం కేసీఆర్ హాలీయా బహిరంగ సభలో పాల్గోని అనేక హామీలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రతి గ్రామానికి 20 లక్షల రూపాయలు, మండల కేంద్రానికి 30 లక్షలు, ఇక నల్గోండ మున్సిపాలిటికి 10 కోట్లు మిర్యాలగూడ మున్సిపాలిటికి 5 కోట్లు జిల్లాలోని మిగతా మున్సిపాలిటీలకు కోటి రూపాయల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపనతోపాటు పలు అభివృద్ది పనులు ఆయన శంకుస్థాపన చేశారు. కాగా వీటన్నింటీపై నేరుగా నియోజకవర్గ నాయకులు, అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. సాగర్  ఉప ఎన్నికల తర్వాత గెలిచిన నోముల భగత్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు.కాని సీఎం మాత్రం ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటి సారి నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
    Published by:yveerash yveerash
    First published: