cm kcr : ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ఒక్కొక్కటిగా నెరవేస్తున్నాను.. జయంతికి నివాళులు.. సీఎం

ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళులు అర్పిస్తున్న సీఎం (ఫైల్ ఫోటో )

CM KCR : ప్రోఫెసర్ జయశంకర్ ఆశయాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.. ప్రోఫెసర్ జయశంకర్ జయంతి సంధర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి కేసిఆర్ స్మరించుకున్నారు.

  • Share this:
    స్వర్గీయ ప్రోఫెసర్ జయశంకర్ జయంతి సంధర్భంగా ఆయన సేవలను కొనియాడారు సీఎం కేసీఆర్...ఈ ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనకోసం చేసిన త్యాగపూరిత సేవలను సిఎం కెసిఆర్ స్మరించుకున్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడుగా, ఉద్యమ భావజాలవ్యాప్తికోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ జన హృదయాల్లో సదా నిలిచివుంటారని అన్నారు. సబ్బండ వర్గాల సమగ్రాభివృద్ది కోసమే తెలంగాణ స్వరాష్ట్రం అని తెలిపిన ప్రొ.జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం వొక్కొక్కటిగా నెరవేరుస్తున్నదని సిఎం తెలిపారు.

    రాష్ట్రాన్ని సాధించిన ఏడేండ్ల అతితక్కువ కాలంలోనే సాగునీటి రంగం, వ్యవసాయరంగం, వంటి పలు మౌలిక భౌతిక రంగాలను తీర్చిదిద్దుకుంటూ వస్తున్నామన్నారు. అదే వరుసలో సకల జనుల సమున్నతాభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం, సామాజిక ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని సిఎం తెలిపారు. అభివృద్దిలో భాగంగా మిషన్ కాకతీయ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు, రైతుబంధు నుంచి దళితబంధు వరకు అనేక వినూత్న పథకాలను అమలు చేస్తున్నదన్నారు.

    ఆర్థిక సామాజిక రంగాల్లో అభివృద్ధిని సాధించి ఆత్మగౌరవంతో దళిత బహుజన సమాజం తలఎత్తుకుని తిరిగే విధంగా, తెలంగాణలో సమ సమాజ స్థాపన దిశగా, బంగారు తెలంగాణ సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తుందనీ, ప్రొ.జయశంకర్ కలలుగన్న తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతామని సిఎం కెసిఆర్ తెలిపారు.
    Published by:yveerash yveerash
    First published: