CM KCR TOUR SCHEDULE OF WANAPARTHY DISTRICT TODAY VRY
CM KCR : వనపర్తికి సీఎం కేసీఆర్.. సాయంత్రం వరకు జిల్లాలోనే...
సీఎం కేసీఆర్(పాత ఫొటో)
CM KCR : సీఎం కేసీఆర్ నేడు వనపర్తి జిల్లాలో బిజిబిజిగా గడపనున్నారు. మరికాసేపట్లో వనపర్తికి వెళ్లనున్న సీఎం సాయంత్రం వరకు జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు,
ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
సీఎం కేసీఆర్ మరికాసేపట్లో వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. హైదరాబాద్ నుండి వనపర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు ఉదయం 11:45 గంటలకు చేరుకొనున్నారు. అక్కడే అగ్రికల్చర్ మార్కెట్ యార్డును ప్రారంభిస్తారు. 15 నిమిషాల్లో కార్యక్రమాన్నిపూర్తి చేసి రోడ్డుమార్గంలో వనపర్తిలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు చేరుకొంటారు. అక్కడ ‘మనఊరు – మనబడి, మనబస్తీ – మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా ఈ నూతన కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడి నుండే ప్రారంభించనున్నారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు.
ఆ తర్వాత నాగవరంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని మధ్యాహ్నం 12:50 గంటలకు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1:20 గంటలకు కలెక్టరేట్‌ను ప్రారంభించి ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. ప్రజాప్రతినిధులతో కలిసి భోజనం చేస్తారు. మధ్యాహ్నం 3:25 గంటలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. మధ్యాహ్నం 3:40 గంటలకు వైద్య కళాశాల ఆవరణలో నిర్వహించే భారీ బహిరంగసభలో ప్రజలు, పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగిస్తారు.
అయితే బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం నెలకొన్న నేపథ్యంలోనే సీఎం ఎలాంటీ వ్యాఖ్యలు చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా గత సభల్లో జాతీయ రాజకీయాలను ప్రస్తావించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆయన విరుచుకుపడ్డారు. అయితే ఇటివల జార్ఖండ్ వెళ్లిన సీఎం ఫ్రంట్ గురించి ఎలాంటీ స్పష్టత ఇవ్వలేదు. దీంతో నేడు జరిగే బహిరంగ సభలో ఎదైనా కొత్త అంశాలు మాట్లాడతారా లేక రాష్ట్ర రాజకీయాలకే పరిమితమవుతారా వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.