హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR: సీఎం కేసీఆర్ పాలమూరు పర్యటనకు అంతా సిద్ధం.. పూర్తి షెడ్యూల్ ఇదే

CM KCR: సీఎం కేసీఆర్ పాలమూరు పర్యటనకు అంతా సిద్ధం.. పూర్తి షెడ్యూల్ ఇదే

కేసీఆర్ (ఫైల్ ఫోటో)

కేసీఆర్ (ఫైల్ ఫోటో)

CM KCR: మహబూబ్‌నగర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.  సీఎం పర్యటన నేపథ్యంలో పాలమూరు పట్టణం కొత్త శోభ సంతరించుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Mahbubnagar (Mahabubnagar)

(సయ్యద్ రఫీ, న్యూస్ 18 తెలుగు, మహబూబ్ నగర్)

తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ (CM KCR) ఆదివారం మహబూబ్ నగర్ (Mahbubnagar) జిల్లా కేంద్రంలో పర్యటించననున్నారు. పట్టణంలో పలు అభివ‌ృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా పరిధిలోని భూత్పూర్ దారిలో ఉన్న నూతన సమీకృత కార్యాలయాల భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అలాగే వివిధ రకాల పనుల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఎంవిఎస్ కళాశాల ఆవరణలో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో పాలమూరు పట్టణం కొత్త శోభ సంతరించుకుంది. పట్టణంలోని జాతీయ రహదారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. గులాబీ తోరణాలు ఫ్లెక్సీలతో పాలమూరు పట్టణాన్ని గులాబీ మయంగా మార్చారు.

సీఎం టూర్ షెడ్యూల్:

సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరుతారు. మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. ముందుగా ఆయన జిల్లా అధికారుల కాంప్లెక్స్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట 15 నిమిషాలకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్న రెండు గంటలకు భోజన విరామం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు కొత్తగా నిర్మించిన టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఎంవీఎస్ కళాశాల మైదాన ప్రాంగణంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం నుండి జిల్లా అధికారులకు ఉత్తర్వులు అందాయి..

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షించారు. మంత్రితో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా అధికారులు, ఇతర టీఆర్ఎస్ నాయకులు సభ స్థలాన్ని పరిశీలించారు. అటు పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

First published:

Tags: CM KCR, Mahbubnagar, Telangana, Trs

ఉత్తమ కథలు