CM KCR TO VISIT BENGALURU TODAY AS PM NARENDRA MODI VISITING HYDEABAD HERE IS MAN REASON BEHIND KCR SKIP SK
CM KCR: ప్రధాని వస్తుంటే.. సీఎం కేసీఆర్ వెళ్లిపోతున్నారు.. బెంగళూరు టూర్కు కారణమేంటి?
సీఎం కేసీఆర్, పీఎం మోదీ (పాత ఫొటోలు)
CM KCR Bengaluru Trip:
ప్రధాని మోదీ హైదరాబాద్కు వస్తుంటే.. ఆ కార్యక్రమాన్ని కాదని.. సీఎం కేసీఆర్ బెంగళూరుకు ఎందుకు వెళ్తున్నారని తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అంత ముఖ్యమైని పని ఏముందని ప్రత్యర్థి పార్టీల వారు ఆరా తీస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన (PM Narendra Modi Telangana Tour) వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మోదీ హైదరాబాద్కు వస్తున్న సమయంలోనే... సీఎం కేసీఆర్ (CM KCR Bengaluru Tour) బెంగళూరుకు వెళ్తుండడం.. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మధ్యాహ్నం ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్పోర్టులో దిగనుండగా.. అంతకు సరిగ్గా రెండున్నర గంట ముందు.. అదే బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి బెంగళూరుకు బయలుదేరుతారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మాజీ ప్రధాని దేవేగౌడ (Deve Gowda)తో ఆయన నివాసంలో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, దేవెగౌడ కుమారుడు కుమారస్వామి (Kumara swamy) కూడా పాల్గొంటారు.
ప్రధాని మోదీ హైదరాబాద్కు వస్తుంటే.. ఆ కార్యక్రమాన్ని కాదని.. సీఎం కేసీఆర్ బెంగళూరుకు ఎందుకు వెళ్తున్నారని తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అంత ముఖ్యమైని పని ఏముందని ప్రత్యర్థి పార్టీ వారు ఆరా తీస్తున్నారు. ఐతే దేశ ప్రస్తుత రాజకీయాలు, ఇతర సమకాలీన అంశాలపై దేవెగౌడ, కుమారస్వామితో సీఎం కేసీఆర్ చర్చిస్తారని సమాచారం. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అంశం, అందులో ప్రాంతీయ పార్టీల పాత్రపై సమాలోచనలు చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ వెంట గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందరెడ్డి బెంగళూరుకు వెళ్తారు. వారితో పాటు కర్ణాటక సరిహద్దులోని తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు. దేవెగౌడ, కుమారస్వామిలతో సమావేశం అనంతరం.. సీఎం కేసీఆర్ మళ్లీ సాయంత్రం హైదరాబాద్కు చేరుకుంటారు.
TS|BJP: కరీంనగర్ ఏక్తాయాత్రలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..రాష్ట్ర బీజేపీ చీఫ్ ఏమన్నారంటే
ప్రధాని మోదీ పర్యటన సమయంలోనే సీఎం కేసీఆర్కు బెంగళూరుకు వెళ్తుండంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రధాని మోదీ అంటే కేసీఆర్కు భయమని.. అందుకే ఆయన హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ.. తప్పించుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ప్రధాని ముందు సీఎంకు ముఖం చెల్లకే.. బెంగళూరుకు వెళ్తున్నారని విమర్వలు గుప్పిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఎవరికీ భయపడే మనిషి కాదని.. టీఆర్ఎస్ నేతలు ఎదరుదాడి చేస్తున్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారు కాకముందే.. కేసీఆర్ బెంగళూరు టూర్ ఖరారయిందని చెబుతున్నారు. ఇప్పుడు మోదీ వస్తున్నారని.. సీఎం కేసీఆర్ తన షెడ్యూల్ను మార్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో సీఎం కేసీఆర్ పాల్గొనకపోవడం ఇది మూడోసారి. 2020 నవంబరు 28న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లో పర్యటించారు. కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ తయారు చేసిన.. భారత్ బయోటెక్ కార్యాలయాన్ని సందర్శించారు. అప్పుడు కూడా కేసీఆర్ వెళ్లలేదు. ఐతే సీఎం రావాల్సిన అవసరం లేదని పీఎవోం చెప్పడం వల్లే.. తాను వెళ్లలేదని సీఎం కేసీఆర్ గతంలో చెప్పారు. ఈ ఫిబ్రవరి నెలలో కూడా ప్రధాని మోదీ హైదరాబాద్కు వచ్చారు. ముచ్చింతల్లోని చిన్నజీయర్ ఆశ్రమంలో సమతా మూర్తి విగ్రహావిష్కరణతో పాటు ఇక్రిశాట్లో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. వాటికి కూడా సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. అనారోగ్య సమస్యల కారణంగానే ప్రధాని మోదీ పర్యటనకు వెళ్లలేదని చెప్పారు. తాజాగా మరోసారి ప్రధాని పర్యటనకు దూరంగా ఉంటున్నారు సీఎం కేసీఆర్.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.