ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లో చేరేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన డెడ్ లైన్ మరో నాలుగు గంటల్లో ముగియనుంది. అయితే ప్రభుత్వం విధించిన డెడ్ లైన్‌ను ఆర్టీసీ కార్మికులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆర్టీసీలో కేంద్రానికి 30 శాతం వాటా ఉందని... ఆర్టీసీ లేకుండా చేయడం రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. కార్మికుల ఉద్యోగాలకు డోకా లేదని చెబుతున్నారు. దీంతో మెజార్టీ కార్మికులు మళ్లీ విధుల్లోకి చేరేందుకు మొగ్గు చూపని పరిస్థితి నెలకొంది. మరో నాలుగు గంటల్లో డెడ్ లైన్ ముగుస్తున్న తరుణంలోనూ కార్మికుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో... మొత్తంగా కేసీఆర్ డైడ్ లైన్‌కు 500 మంది కార్మికులు విధుల్లోకి వచ్చే అవకాశాల కూడా ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికులు తాము ఇచ్చిన గడువులోగా విధుల్లోకి చేరకుంటే... మొత్తం రూట్లను ప్రైవేటు చేస్తామని స్పష్టం చేసిన సీఎం కేసీఆర్... అదే రకమైన నిర్ణయంతో ముందుకు సాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు కూడా మొదలుపెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆర్టీసీ కార్మికులు న్యాయపోరాటంపైనే ఎక్కువగా అశలు పెట్టుకున్నారనే భావనలో ఉన్న ప్రభుత్వం... ఈ కేసు విషయంలో హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. కేసు సుప్రీంకోర్టుకు చేరితే మరింత సమయం పడుతుందని... ఈ కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడమే మంచిదనే యోచనలో సర్కార్ ఉందని సమాచారం. మొత్తానికి రేపు ఆర్టీసీ అంశంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana, Telangana News, Trs, Tsrtc, Tsrtc privatization, TSRTC Strike