Amazon : ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లో.. నేడే ప్రారంభోత్సవం

Amazon Worlds Largest Campus in Hyd : అమెజాన్ నిర్మించిన ఈ క్యాంపస్‌ నుంచే సంస్థ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను నిర్వహించనుంది. ఒకేసారి 30వేల మంది ఇక్కడి నుంచి పనిచేసేలా మౌలిక వసతులను ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. దేశంలోనే అతిపెద్ద గోడౌన్‌ను శంషాబాద్ సమీపంలో ఏర్పాటు చేసిన అమెజాన్..ఇప్పుడు అతిపెద్ద క్యాంపస్‌ను కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయడంతో.. సిటీ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగిందంటున్నారు.

news18-telugu
Updated: August 21, 2019, 7:32 AM IST
Amazon : ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లో.. నేడే ప్రారంభోత్సవం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 21, 2019, 7:32 AM IST
ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నేడు ప్రారంభించనుంది. 10 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక మౌలిక వసతులతో 15 అంతస్తుల భవనంలో ఈ క్యాంపస్ ఏర్పాటైంది. క్యాంపస్ ఆఫీస్ స్పేస్ దాదాపు 20లక్షల చదరపు మీటర్లు కాగా.. పార్కింగ్ స్పేస్ 1మిలియన్ చదరపు మీటర్లు. నానక్‌రామ్‌ గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఏర్పాటైన ఈ క్యాంపస్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అమెజాన్‌ ఇండియా సీనియర్‌ వైస్ ప్రెసిడెంట్, మేనేజర్‌ అమిత్‌ అగర్వాల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకున్న క్యాంపస్‌లో.. ఇప్పటికే 7వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే నిర్మాణం పూర్తి కాకపోవడంతో అధికారికంగా ప్రారంభించలేదు. తాజాగా నిర్మాణ పనులన్నీ పూర్తవడంతో అధికారికంగా ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. అమెజాన్ నిర్మించిన ఈ క్యాంపస్‌ నుంచే సంస్థ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను నిర్వహించనుంది. ఒకేసారి 30వేల మంది ఇక్కడి నుంచి పనిచేసేలా మౌలిక వసతులను ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. దేశంలోనే అతిపెద్ద గోడౌన్‌ను శంషాబాద్ సమీపంలో ఏర్పాటు చేసిన అమెజాన్..ఇప్పుడు అతిపెద్ద క్యాంపస్‌ను కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయడంతో.. సిటీ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగిందంటున్నారు.

ఐటీ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఐబీఎం, ఒరాకిల్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టీసీఎస్‌, టెక్‌ మహేంద్ర వంటి సంస్థలు ఇప్పటికే హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేశాయి.ప్రపంచ ప్రఖ్యాత యాపిల్ కంపెనీ సైతం ఇప్పటికే మ్యాప్స్ డెవలప్ సెంటర్‌ను ప్రారంభించింది. తాజాగా అమెజాన్ అతిపెద్ద క్యాంపస్‌‌ను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయడంతో భవిష్యత్‌లో మరిన్ని సంస్థలు ఇక్కడి క్యూ కడుతాయని అంటున్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఇది మరింత ఊతమిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...