హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR | Centre : ఉద్యోగులకు 50 శాతం జీతాలు! -అప్పులపై కేంద్రం ఆంక్షలతో కటకట -కేసీఆర్ కాంప్రమైజ్?

CM KCR | Centre : ఉద్యోగులకు 50 శాతం జీతాలు! -అప్పులపై కేంద్రం ఆంక్షలతో కటకట -కేసీఆర్ కాంప్రమైజ్?

కేసీఆర్, మోదీ, నిర్మల (పాత ఫొటోలు)

కేసీఆర్, మోదీ, నిర్మల (పాత ఫొటోలు)

తెలంగాణ అప్పులపై కేంద్రం, ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారింది. ఉద్యోగులకు 50 శాతం వేతనాలు మాత్రమే ఇవ్వనున్నారు. పరిస్థితి అదుపుతప్పకుండా కేసీఆర్ కేంద్రంతో రాజీకి యత్నిస్తోన్నట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

కొత్త అప్పులు చేయడానికి వీల్లేదంటూ తెలంగాణపై కేంద్రం, ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారింది. సాధారణ రెవెన్యూ ఖర్చులతోపాటు ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం వేతనాలు మాత్రమే ఇవ్వనున్నారు. అయితే ఆ దుస్థితిని తప్పించుకునేలా సీఎం కేసీఆర్ కేంద్రంతో కాంప్రమైజ్ ధోరణిలోకి మారినట్లు తెలుస్తోంది.

పలు అంశాల్లో కేంద్రం మెడలు వంచుతానంటూ శపథాలు చేసిన కేసీఆర్.. అప్పుల విషయంలోనూ న్యాయపోరాటానికి దిగబోతున్నట్లు ఇటీవల సంకేతాలిచ్చారు. కానీ ఆర్థిక పరిస్థితి జఠిలంగా మారే అవకాశాలు ఉండటంతో చివరికి రాజీధోరణిని అనుసరించాలని గులాబీ బాస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నాటి ఢిల్లీ టూర్ లోనే కేసీఆర్ దీనిని అమలు చేస్తారని తెలుస్తోంది..

CM KCR | Centre: భారీ షాక్.. టీఎస్ ప్రాజెక్టులు, పథకాలకు కేంద్రం, ఆర్బీఐ బ్రేక్! -అప్పులపై కోర్టుకు కేసీఆర్?


తెలంగాణలో బీజేపీ బలం పెరిగిన క్రమంలో ఆ పార్టీపై టీఆర్ఎస్ పోరును ఉధృతం చేయడం, కేంద్రం వర్సెస్ కేసీఆర్ సర్కార్ అన్నట్లుగా సాగుతోన్న వివాదం మరింత ముదరడం తెలిసిందే. తెలంగాణ అప్పులపై కేంద్రం ఇటీవలే తీవ్ర ఆంక్షలు విధించడం వివాదాల్లో పీక్ అంశంగా నిలిచింది. ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలను కూడా ఎఫ్‌ఆర్‌బీఎం కింద లెక్కగడుతున్నామని కేంద్రం చెప్పగా, ఆ వెంటనే రుణ సంస్థలన్నీ ఆర్బీఐ అనుమతి తీసుకుంటేనే తెలంగాణకు రుణాలిస్తామంటూ మెలికలు పెట్టాయి. కనీసం ప్రభుత్వ బాండ్లను వేలంలో అమ్ముకునే అవకాశాన్ని కూడా తెలంగాణకు కల్పించలేదు. కొత్త అప్పులు పుట్టకపోవడం, బాండ్లను అమ్ముకునే పరిస్థిత లేకపోవడానికితోడు గతంలో మంజూరైన రుణాల విడుదల కూడా ఆగిపోవడంతో తెలంగాణ ప్రాజెక్టులు, పథకాలు, ఉద్యోగుల జీతాలు అనివార్యంగా బ్రేక్ పడే పరిస్థితి నెలకొంది.

CM KCR: పట్టువీడని కేసీఆర్.. నేటి నుంచి దేశవ్యాప్త పర్యటన.. 8 రాష్ట్రాలు ప్రభావితం అయ్యేలా.. ఇదీ ప్లాన్..


అప్పులకు కేంద్రం, ఆర్బీఐ మోకాలడ్డటంతో ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీలు)ను వినియోగించుకోవాలని తెలంగాణ ఆర్థిక శాఖ భావిస్తోంది. పరిస్థితి కొనసాగితే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ చాలా కష్టతరం కానుంది. దీంతో అప్పులు తెచ్చుకునే విషయంలో కేంద్రం విధించిన అనవసరపు ఆంక్షల సడలింపు కోసం కేసీఆర్ సర్కార్ కోర్టులను ఆశ్రయించాలని భావిస్తున్నట్లు బుధవారం నాడు వార్తలు వెలువడ్డాయి. కానీ ఈ విషయంలో యుద్దం కంటే రాజీధోరణే మంచిదని కేసీఆర్ మనసు మార్చుకున్నట్లు తాజాగా వెల్లడైంది. ఢిల్లీలో పరిస్థితిని చక్కదిద్దడానికి, కేంద్రం మనఃస్థితి ఏవిధంగా ఉందో తెలుసుకోవడానికి తెలంగాణ ఆర్థిక శాఖ అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించడమే ఇందదుకు నిదర్శనంగా నిలిచింది. బుధ లేదా గురువారాల్లోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నట్లు లీకులు వచ్చినా, శుక్రవారంనాటికి వ్యూహం మార్చుకొని కేంద్రంతో సంప్రదింపులకు కేసీఆర్ యత్నిస్తున్నారు. అందులో భాగంగా..

CM KCr | Rameswar Rao Jupally: కేసీఆర్‌తో విభేదాలు.. మైహోం జూపల్లికి బీజేపీ రాజ్యసభ సీటు?


జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ అజెండా రూపొందిస్తామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నుంచి దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీతోపాటు మొత్తం 8 రాష్ట్రాలు ప్రభావితం అయ్యేలా రాబోయే వారంరోజుల పాటు ఆయన కార్యక్రమాలు ఉండనున్నాయి. అయితే ఢిల్లీ వెళ్లగానే ముందుగా అప్పుల విషయంలో కేసీఆర్ కేంద్రం పెద్దలను కలవనున్నట్లు తెలుస్తోంది. అప్పులకు అనుమతి కోరుతూ సీఎం కేసీఆర్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవబోతున్నారు. నిర్మలను కేసీఆర్ కలుస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) స్వయంగా ప్రకటించింది. నిర్మలతో చర్చల్లో ఫలితాలను బట్టి కేసీఆర్ ఇంకొంత మంది కేంద్రం పెద్దలను కూడా కలిసే అవకాశాలు లేకపోలేవు. అదే సమయంలో..

CM KCR | Centre: కేసీఆర్ సంచలనం.. గ్రామాలకు నేరుగా కేంద్రం నిధులు వద్దు.. రాష్ట్రాల ద్వారానే అన్ని పథకాలు..


అప్పులకు అనుమతి కోసం ఢిల్లీకి ఆర్థికశాఖ అధికారులుకాగా అప్పులకు అనుమతించేది లేదని కేంద్రం స్పష్టం చేయడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా కుదేలయింది. దాంతో పరిస్థితిని చక్కదిద్దడానికి, కేంద్రం మనఃస్థితి ఏవిధంగా ఉందో తెలుసుకోవడానికి ఢిల్లీకి వెళ్లాలని ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దాంతో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్‌ను కలవడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఢిల్లీకి పంపించారు. సీఎం ఆదేశాలతో గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయన.. సోమనాథన్‌ను కలిసే యత్నంలో ఉన్నారు. కాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన, అధికారుల ప్రయత్నాలు విఫలమై, తెలంగాణ అప్పులకు కేంద్రం గనుక అనుమతి ఇవ్వకపోతే జూన్‌ నెలలో ఉద్యోగులకు 50 శాతం వేతనాలు మాత్రమే ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి పరిస్థితి అంతదాకా దారి తీస్తుందా? లేదా? అనేది మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.

First published:

Tags: Bjp, CM KCR, Delhi, Nirmala sitharaman, Telangana, Union government

ఉత్తమ కథలు