CM KCR: నేడు మంత్రులతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం.. ఎజెండా ఇదే..

మంత్రులతో సమావేశం తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశముంది. అంతేకాదు ఒకటి రెండు రోజుల్లోనే తెలంగాణ కేబినెట్ సమావేశం ఖరారు కావచ్చు.

news18-telugu
Updated: November 12, 2020, 6:40 AM IST
CM KCR: నేడు మంత్రులతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం.. ఎజెండా ఇదే..
సీఎం కేసీఆర్ (ఫైల్ పోటో)
  • Share this:
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. సిట్టింగ్ స్థానంలో అనూహ్యంగా బీజేపీ గెలవడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదెలా జరిగిందన్న దానిపై మంత్రులు, నేతలు పోస్టుమార్టం చేస్తున్నారు. అదే క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టిసారించింది టీఆర్ఎస్ హైకమాండ్. దుబ్బాక ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దూసుకెళ్లాలని భావిస్తోంది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగా ఇవాళ మంత్రులతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమై జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది.

మంత్రులతో సమావేశం తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశముంది. అంతేకాదు ఒకటి రెండు రోజుల్లోనే తెలంగాణ కేబినెట్ సమావేశం ఖరారు కావచ్చు. ఆ సమావేశంలో జీహెచ్ఎంసీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకమండలికి వచ్చే ఫిబ్రవరి వరకు గడువు ఉంది. ఈనేపథ్యంలో అంతకంటే ముందే ఎన్నికలు జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. కానీ ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై క్లారిటీ కొరవడింది. ఐతే దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత జీహెచ్ఎంసీలోనూ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో అందరి కంటే ముందుగానే ఎన్నికలకు సన్నద్ధం కావాలని టీఆర్ఎస్ భావిస్తోంది.

దుబ్బాక ఉపఎన్నికలో విజయంపై టీఆర్ఎస్ ముందు నుంచీ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది. కానీ బీజేపీ రఘునందన్ రావు అభ్యర్థి టీఆర్ఎస్‌కు ధీటుగా ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్‌కు ఓటమి తప్పదని చెప్పిన.. అన్నట్లుగానే అనూహ్యంగా గెలిచి అధికారి పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. దుబ్బాకలో విజయంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇదే ఊపుతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది.

ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జీహెచ్ఎంసీ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. వరదలతో నష్టపోయిన నగరవాసులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. రూ.10వేల సాయాన్ని కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకే పంచి చేతులు దులుపుకున్నారని మండిపడుతున్నారు. హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వమే అభివృద్ధి చేసిందని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపిస్తే..మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని అక్రమాలకు పాల్పడినా గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి గ్రేటర్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: November 12, 2020, 6:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading